News
paritala sunitha, Raptadu: చిల్లర వెదవలు పరిటాల రవి గురించి మాట్లాడుతున్నారు: పరిటాల సునీత – paritala sunitha made sensational comments on ysrcp
‘వైఎస్సార్సీపీ నాయకులు ఎంతో మంది పసుపు కుంకాలు తుడిపేశారు. ఆ కుటుంబాల్లో మహిళల్ని అడగితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. మా కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో.. కొంత మంది చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోరు. కానీ.. మేము ఏమైనా సమావేశాలు ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చి అడ్డుకుంటారు. మహిళలు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితిలో పోలీసులు లేరు’ అని పరిటాల సునీత వ్యాఖ్యానించారు.
ఇటీవల అనంతపురం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాకు చెందిన యువకుల మధ్య జరిగిన సోషల్ మీడియా వార్.. రాప్తాడుకు.. అక్కడి నుంచి అనంతపురం క్లాక్ టవర్‌కు చేరింది. ఇది కాస్త టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. దీనిపై పరిటాల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పరిటాల సునీత ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అటు రాప్తాడులో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపైనా పరిటాల కుటుంబం పోరాటం చేస్తోంది.
Read Latest Andhra Pradesh News and Telugu News