Entertainment

HUNT Glimpse: హాలీవుడ్ యాక్షన్ రెంజ్‏లో సుధీర్ బాబు ‘హంట్’.. మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన రానా దగ్గుబాటి..


తాజాగా హీరో రానా దగ్గుబాటి సోమవారం సినిమా యాక్షన్ మేకింగ్ వీడియోను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. హాలీవుడ్ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ‘హంట్’ సినిమాలో యాక్షన్ దృశ్యాలను తెరకెక్కించారని ఆ మేకింగ్ వీడియో చూస్తే తెలుస్తోంది.

నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. ఈ చిత్రానికి మహేష్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా హీరో రానా దగ్గుబాటి సోమవారం సినిమా యాక్షన్ మేకింగ్ వీడియోను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. హాలీవుడ్ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ‘హంట్’ సినిమాలో యాక్షన్ దృశ్యాలను తెరకెక్కించారని ఆ మేకింగ్ వీడియో చూస్తే తెలుస్తోంది. సుధీర్ బాబు, భరత్, యాక్షన్ టీమ్ పడిన కష్టం ఆ వీడియోలో కనిపించింది. డూప్స్, రోప్స్ వాడకుండా ప్రేక్షకులకు రియలిస్టిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసం చిత్ర బృందం శ్రమించింది.

యాక్షన్ సన్నివేశాల గురించి హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ ”హంట్’ రెగ్యులర్ ఫార్ములాలో వెళ్ళే సినిమా కాదు. కథను నిజాయతీగా చెప్పే ప్రయత్నం చేశాం. క్యాంపస్ యూనివర్స్ కాస్‌కేడ్స్ అని ఒక టీమ్ ఉంది. ఫ్రాన్స్‌లో ఉంటారు. వాళ్లను కొన్ని సంవత్సరాలుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నాను. చాలా కొత్తగా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫైట్స్ చేస్తుంటారు. స్టంట్ పీపుల్ కూడా రోప్స్, బెడ్స్ వాడలేదు. సినిమాలో ఎక్కడా ఒక్క రోప్, బెడ్ వాడలేదు. మా కెమెరామెన్ ఉన్నా… ఫైట్స్ వరకు ఆ టీమ్ కెమెరామెన్ వర్క్ చేశారు. ఆయన కూడా ఫైటర్, స్టంట్ మన్. ‘విక్రమ్’లో స్టంట్స్ షూట్ చేసేటప్పుడు బోల్ట్ అని కెమెరా కోసం మిషనరీ వాడారు. ఆ మిషనరీ లేకుండా అటువంటి ఎఫెక్ట్ కెమరామెన్ తీసుకొచ్చారు. దానికి చాలా స్కిల్స్ కావాలి. భరత్‌కు కూడా యాక్షన్ సీక్వెన్స్ ఉంది. మనిషిని పైకి ఎత్తి మూడు నాలుగు అడుగుల దూరంలో ఉన్న గోడపై విసరాలి. ఎవరు చేస్తారని అనుకున్నా. భరత్ బాగా చేశాడు. షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు చాలా రిహార్సల్స్ చేశారు క్యాంపస్ యూనివర్స్ కాస్‌కేడ్స్ టీమ్. ఈ సినిమాలో యాక్సిడెంట్ తర్వాత మెమరీ లాస్ అయిన వ్యక్తిగా నటించాను.

సినిమా చూసే ప్రేక్షకులకు ఒక్కటే క్యారెక్టర్. కానీ, నా వరకు డబుల్ రోల్. మెమరీ లాస్ అవ్వడానికి ముందు, తర్వాత… అర్జున్ పాత్రలో డిఫరెన్స్ యాక్షన్ సీక్వెన్సుల్లో కూడా కనబడుతుంది. అంజి మాస్టర్ ఆరేడు కెమెరాలతో ఛేజ్ సీక్వెన్స్, కార్ యాక్సిడెంట్ చేశారు. ఆయన కూడా రియల్‌గా షూట్ చేశారు. సీజీ వర్క్స్ లేకుండా ఫైట్స్ కూడా రియల్‌గా ఉండాలని అనుకున్నాం. అందుకే, అన్ని కెమెరాలు వాడాం. అన్ని యాంగిల్స్‌లో షూట్ చేశాం. ఛేజ్ సీక్వెన్సు కూడా బాగా వచ్చింది. ఇంటర్వెల్ ముందు ఒక సీక్వెన్స్ వస్తుంది. దానికి కూడా రిహార్సిల్స్ చేశాం. సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు… చాలా కథ ఉంది” అని చెప్పారు.



మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

ఇవి కూడా చదవండి

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button