News

palnadu father kills son, పల్నాడు: కుమారుడి తల నరికిన తండ్రి.. దాంతో ఊరంతా తిరిగిన సైకో – father kills son near nekarikallu palnadu district


పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. మద్యానికి బానిసైన తండ్రి సైకోలా మారాడు.. కొడుకు తల నరికి కిరాతకంగా హత్య చేశాడు. నకరికల్లు మండలం గుళ్లపల్లికి చెందిన బత్తుల వీరయ్య కూలీ పనులు చేస్తుంటాడు. అతడి భార్య అలివేలమ్మ రెండేళ్ల కిందట కువైట్‌కు వెళ్లింది. ఈ దంపతులకు కుమారుడు అశోక్, కుమార్తె ఉన్నారు. ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు కూడా చేశారు. అశోక్‌ భార్య ఇటీవలే పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో తడ్రి వీరయ్య, కుమారుడు అశోక్ మాత్రమే ఉన్నారు.

కువైట్‌లో ఉన్న అలివేలమ్మ కుమారుడి బ్యాంకు అకౌంట్‌కు 4 రోజుల క్రితం రూ.5 వేలు పంపింది. అయితే మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలని వీరయ్య గొడవ పెట్టుకుంటున్నాడు. గురువారం రాత్రి తండ్రి, కుమారుడు వేర్వేరుగా మద్యం సేవించారు. ఆ కిక్కులో ఇద్దరూ గొడవపడ్డారు. ఆ కోపంలో వీరయ్య కుమారుడు అశోక్ తలపై రాయితో దాడి చేశాడు. అశోక్‌ కిందపడటంతో ఇంట్లో నుంచి కత్తి తెచ్చి తలను మొండెం నుంచి వేరు చేశాడు.

కుమారుడి తలను ఓ బస్తాలో వేసుకుని గ్రామంలో ఉన్న బెల్టుషాప్‌ దగ్గరకు వెళ్లి.. మళ్లీ అక్కడ మద్యం సేవించాడు. ఆ తర్వాత కుమారుడి తల తెగ నరికానంటూ గ్రామంలో తిరిగాడు.. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వీరయ్యను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అశోక్‌ భార్య లక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్న కారణానికే మద్యం మత్తులో కుమారుడి తలను తెగ నరికాడు తండ్రి.

  • Read Latest Andhra Pradesh News and Telugu News

Related Articles

Back to top button