Entertainment

Aryan Khan-Sadia Khan:షారుఖ్ కొడుకు ఆర్యన్‌తో పాకిస్థాన్‌ మోడల్ డేటింగ్‌.. క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ


డ్రగ్స్ కేసు నుంచి బయటపడిన ఆర్యన్ ఖాన్.. తాజాగా, పాకిస్థాన్ మోడల్, నటితో డేటింగ్‌ చేస్తున్న వార్త నెట్టింట చక్కెర్లు కొడుతోంది. పాకిస్తాన్‌ మోడల్‌, నటి సాదియా ఖాన్‌తో ఆర్యన్ ఖాన్ డేటింగ్‌లో

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌.. కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్‌ కేసుతో నుంచి సంచలనమైన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసు నుంచి బయటపడిన ఆర్యన్ ఖాన్.. తాజాగా, పాకిస్థాన్ మోడల్, నటితో డేటింగ్‌ చేస్తున్న వార్త నెట్టింట చక్కెర్లు కొడుతోంది. పాకిస్తాన్‌ మోడల్‌, నటి సాదియా ఖాన్‌తో ఆర్యన్ ఖాన్ డేటింగ్‌లో ఉన్నాడంటూ మీడియాలో వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. వీరిద్దరూ క్లోజ్‌గా దిగిన ఫొటోలు బయటకు రావడంతో.. ఆర్యన్, సాదియా మధ్య ప్రేమ చిగురించిందని.. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై క్లారిటీ రాకముందే బాలీవుడ్‌ భామ, డాన్సర్‌ నోరా ఫతేహితో ఆర్యన్‌ ఖాన్‌ ప్రేమాయణం కొనసాగిస్తున్నాంటూ వార్తలు వచ్చాయి. అయితే, ఇవన్నీ ఎంతమేర నిజమో తెలియనప్పటికీ.. ఆర్యన్‌ ఖాన్ తో డేటింగ్‌ విషయంపై పాకిస్థాన్‌ మోడల్ సాదియా ఖాన్‌ స్పందించింది.

ఓ మీడియాతో మాట్లాడిన సాధియా ఖాన్.. ఆర్యన్‌తో డేటింగ్‌పై విషయంపై క్లారిటీ ఇచ్చింది. అసలేం తెలియకుండానే ఇలాంటి వార్తలు ఎలా సృష్టిస్తారంటూ.. ఈ ముద్దుగుమ్మ అసహనం వ్యక్తం చేసింది. ఆర్యన్ తో కలిసి ఫొటో దిగితే రిలేషన్‌లో ఉన్నట్లేనా? అసలు విసయం ఏంటీ.. ఏం జరిగింది.. అని తెలియాకుండానే అలా ఎలా రాసేస్తారంటూ పాక్ ముద్దుగుమ్మ మండిపడింది. ఒక్క ఫొటో చూసి మేం ఇద్దరం డేటింట్‌లో ఉన్నామంటూ ఎలా పేర్కొంటారు.. ఇదంత వింతగా.. విచిత్రంగా అనిపిస్తోంది.. అంటూ ఫైర్ అయ్యింది.

Aryan Sadia

Aryan Sadia

అయితే ఆర్యన్ ఖాన్‌ను ఎప్పుడు కలిశారన్న విషయంపై ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చింది. ఆర్యన్‌ను న్యూ ఇయర్‌ ఈవెంట్‌లో కలిశాను. అప్పుడు మేం ఇద్దరం మాట్లాడుకున్నాం.. ఈ సందర్భంగా ఫొటో దిగాం. ఫొటో దిగినంత మాత్రానా డేటింగ్‌లో ఉన్నట్లు కాదంటూ పేర్కొంది. ఆ రోజు న్యూ ఇయర్‌ పార్టీలో తాను మాత్రమే లేనని.. చాలా మంది ఉన్నారంటూ పేర్కొంది. వారంతా కూడా ఆర్యన్‌తో ఫొటో దిగారని.. వారు కూడా సోషల్‌ మీడియాలో ఫొటోలు కూడా షేర్‌ చేశారని పేర్కొంది. కానీ, అవన్నీ కాకుండా తమపైనే రూమర్స్ రావడం అస్సలు అర్థం కావడం లేదని సాధియా పేర్కొంది.

ఇదిలాఉంటే.. దుబాయ్‌లో జరిగిన న్యూ ఇయర్‌ ఈవెంట్‌లో సాధియా ఖాన్‌, ఆర్యన్‌ ఖాన్‌లు కలిసి ఫొటో దిగారు. ఈ ఫొటోలను సాదియా తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఆ తర్వాత వెంటనే వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు షికార్లు చేశాయి. మోడల్‌ అయిన సాధియా ఖాన్‌ పాకిస్థాన్‌లో పలు టీవీ సీరియల్స్‌తో ప్రాచుర్యం పొందింది.

ఇవి కూడా చదవండి

Advertisement

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button