News

Pakeezah Vasuki,Actress Pakeezah: నటి పాకీజా భిక్షాటన.. తిరుపతిలో దీనస్థితి – actress pakeezah vasuki begging at tirumala tirupati


నటి పాకీజా (Actress Pakeezah Vasuki) దీన స్థితిపై కళ్లు చెమర్చే ఘటన ఇది. ‘‘నాకు తినడానికి తిండి లేదు.. ఉండటానికి ఇల్లు లేదు.. దానం చేయండి.. నేను మీ పాకీజాని.. మీకు తోచినంత సాయం చేయండి’’ అంటూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భిక్షాటన చేస్తూ కనిపించింది సీనియర్ నటి పాకీజా.

తిరుపతి గుడి మెట్ట వద్ద ఉన్న షాప్‌ల వద్దకి వెళ్లి.. తన దీన స్థితిని చెప్పుకుని చేతులు చాచి భిక్షాటన చేసింది పాకీజా. తన ఆర్ధిక పరిస్థితి సరిగా లేదని.. దయచేసి దానం చేయాలని కోరుతూ ప్రతి షాప్‌కి తిరిగి భిక్షాటన చేసింది. అయితే దాతలు స్పందించి.. ఆమెకు తోచిన సాయం చేశారు. పలువురు భక్తులు కూడా పాకీజాకి దానం చేసి.. ఆమెతో ఫొటోలు దిగారు. అయితే తాను భిక్షాటన చేయడానికి కారణం.. తన ఆర్ధిక పరిస్థితే అని.. కనీసం ఈ వీడియో చూసైనా ఇండస్ట్రీ వాళ్లు సాయం చేస్తారని ఇలా చేస్తున్నట్టు చెప్పింది పాకీజా.

కాగా తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో అనేక సినిమాల్లో నటించిన పాకీజా.. తినడానికి తిండి లేక ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండగా.. ఓ ఇంటర్వ్యూ ద్వారా దాతల నుంచి సాయం పొందిన విషయం తెలిసిందే. సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాకీజా దీన స్థితిపై చలించిన అనేక మంది ఆమెకు ఆర్ధిక సాయం చేశారు. మొదట మెగా ఫ్యామిలీ నుంచి మెగా బ్రదర్ నాగబాబు లక్షరూపాయల ఆర్ధికసాయాన్ని ప్రకటించారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించి ఆమెకు లక్ష ఆర్ధిక సాయాన్ని అందించారు. ఆ తరువాత ఇండస్ట్రీ నుంచి బయట నుంచి అనేక మంది స్పందించి పాకీజా ఆర్ధికంగా ఆదుకుని ఆమె కష్టాలను తీర్చారు.

ఆ తరువాత పాకీజా సంతోషంగా వ్యక్తం చేస్తూ.. తెలుగు వాళ్లు చేసిన సాయానికి కృత‌జ్ఞతలు తెలిపింది. తాను చాలా బాగున్నానని.. జబర్దస్త్‌లోకి పిలిచారు.. ఔట్ డోర్ షూటింగ్‌లతో బిజీ అయ్యానని.. దాదాపు నెలలో 20 రోజులు షూటింగ్‌కి పిలుస్తున్నారని చెప్పింది. మెగా ఫ్యామిలీ దయ.. దాతల సాయంతో తాను ఆర్ధికంగా కోలుకున్నానని.. బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయానని.. సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్, జబర్దస్త్ ఇలా చాలావాటిలో అవకాశాలు ఇస్తున్నారని చెప్పి సంతోషపడిపోయింది పాకీజా. అయితే ఇప్పుడు మళ్లీ.. ఇలా తిరుమల కొండపై భిక్షాటన చేస్తూ కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది పాకీజా. అయితే పాకీజా కూడా యూట్యూబర్ వైజాగ్ సత్య కూడా ఉన్నాడు.

Pakeezah Begging: తిరుపతిలో నటి పాకీజా భిక్షాటన.. షాప్‌ల దగ్గరకు వెళ్లి చేయి చాస్తూ

Related Articles

Back to top button