News
P Narayana, మాజీ మంత్రి నారాయణకు బిగ్ రిలీఫ్.. జగన్ సర్కార్‌కు సుప్రీం కోర్టు నోటీసులు – big relief to ex minister ponguru narayana is supreme court
రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ మే 13న జిల్లా సెషన్స్ కోర్టు ముందు రివిజన్ పిటిషన్ వేసింది. జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినకుండానే మేజిస్ట్రేట్ రిమాండ్‌ను తిరస్కరించడం చెల్లదని.. అందుకే నారాయణ 30 రోజుల్లో కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను నారాయణ హైకోర్టులో సవాల్ చేశారు.. రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. మేజిస్ట్రేట్ ఉత్తర్వుల్లోని మెరిట్స్‌లోకి వెళ్లకుండానే జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి అది చెల్లదని.. మళ్లీ అన్ని విషయాలనూ పరిశీలించి తీర్పు ఇవ్వాలని ఈ కేసును తిరిగి జిల్లా కోర్టుకు పంపిన సంగతి తెలిసిందే.
రిమాండ్‌ను తిరస్కరిస్తూ మేజిస్ట్రేట్ ఇచ్చింది తుది ఉత్తర్వులే కాబట్టి రివిజన్ పిటిషన్ సరైందేనని తెలిపింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మాజీ మంత్రి నారాయణ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేయగా.. మధ్యంతర ఉత్తర్వులపై రివిజన్ పిటిషన్ వేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. నారాయణ తరపు లాయర్ వాదనలు విన్న సుప్రీంకోర్టు డిసెంబర్ 6న హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. దీంతో నారాయణకు ఊరట లభించింది.
- Read Latest Andhra Pradesh News and Telugu News