Entertainment

Sir Movie: ఓటీటీలోకి ధనుష్ ‘సార్’.. ఎప్పుడు.. ఎక్కడంటే..?


Dhanush Sir Movie

కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్ తెలుగు, తమిళ భాషల్లో తొలిసారి చేసిన బైలింగ్వల్ సినిమా ‘సార్’. తమిళ్‌లో ‘వాతి’ పేరుతో ఈ చిత్రం విడుదలయ్యింది. వెంకీ అట్లూరి  ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. విద్య‌ను వ్యాపారంగా మార్చుతోన్న వారిపై ఓ సాధార‌ణ లెక్చ‌ర‌ర్ సాగించిన పోరాటం నేప‌థ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ధ‌నుష్‌కు జోడీగా సంయుక్త హీరోయిన్‌గా న‌టించింది. స‌ముద్ర‌ఖ‌ని, హైప‌ర్ ఆది, తనికెళ్ళ భరణి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సుమంత్ కూడా ముఖ్య పాత్రలో మెరిశాడు. జీవీ ప్రకాశ్ సంగీతంతో పాటు వెంకీ అట్లూరి రాసుకున్న డైలాగ్స్ బాగా పేలాయి.

ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకెళ్తుంది. వరల్డ్ వైడ్ ఇప్పటికే రూ.75 కోట్లు పైచిలుకు కలెక్షన్స్ రాబట్టింది సార్ సినిమా. త్వరలోనే వంద కోట్ల క్లబ్బులో చేరడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ భారీ రేటుకు ‘సార్‌ ‘డిజిటల్‌ రైట్స్‌ను దక్కించుకుంది.

నెట్‌ఫ్లిక్స్‌‌లో మార్చి 22 నుంచి ఈ మూవీ స్ట్రీమ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Back to top button