News
orr road accident, Sangareddy: ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. రోడ్డు పక్కన గుడిసెల్లోకి దూసుకెళ్లిన లారీ ! – three died in a road accident at orr in sangareddy
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బియ్యం లోడుతో హర్యానా నుంచి చిత్తూరు వెళుతున్న లారీ తెల్లవారుజామున 4 గంటల సమయంలో బీభత్సం సృష్టించింది. ఓఆర్ఆర్‌పై వెళ్తూ.. అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గుడిసెలోకూ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గుడిసెలో నివసిస్తున్న కమలీబాయ్ (43), బాబు రాథోడ్ (48), బసప్ప రాథోడ్ (23) అక్కడిక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన వీరు రోడ్డు పక్కన ఉన్న చెట్లకు నీళ్లుపోస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనలో మరికొందరు గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. ప్రస్తుతం డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
- Read More Telangana News And Telugu News