Entertainment

Pintu Nanda: ఇండస్ట్రీలో మరో విషాదం.. అనారోగ్యంతో ప్రముఖ నటుడు కన్నుమూత.. హైదరాబాద్ ఆసుపత్రిలో..


కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మొదట్లో భువనేశ్వర్‏లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల లెజెండరీ డైరెక్టర్ కె.విశ్వానాథ్ మరణవార్త మరువకముందే సింగర్ వాణీ జయరాం అకాల మరణం చెందారు. ఇక ఆ తర్వాత దాదాపు 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి చిన్న వయసులోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు నందమూరి తారకరత్న. బుధవారం రాత్రి ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఒరియా నటుడు పింటు నంద కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‏లో తుదిశ్వాస విడిచారు. కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మొదట్లో భువనేశ్వర్‏లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.

ఆ తర్వాత ఆయనను కాలేయ మార్పిడి కోసం న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ILBS)కి తరలించి చికిత్స అందించారు. అక్కడ అవయవదాత అందుబాటులో లేకపోవడంతో.. ఆయనను ఢిల్లీ నుంచి హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బుధవారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. నంద మృతితో సినీ పరిశ్రమలో విషాదచాయలు అలుముకున్నాయి. నంద మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

హీరోగా, ప్రతినాయకుడిగా, సహయ నటుడిగా, హాస్యనటుడిగా ఒరియా సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు నంద. బుల్లితెరపై కూడా ఫేమస్ అయ్యారు నంద. 1996లో కోయిలి చిత్రంతో అరంగేట్రం చేశారు నందా. దోస్తీ, హట ధారి చాలు తా, రుంకు ఝుమానా , రాంగ్ నంబర్, ప్రేమ రుతు అసిగల చిత్రాల్లో నటించారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button