News
ntrs 100th birthday celebrations, Traffic Restrictions: వాహనదారులకు బిగ్ అలర్ట్.. నేడు హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. – traffic restrictions in kukatpally area of hyderabad today
Traffic Restrictions: యుగ పురుషుడు నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలను నేడు కూకట్‌పల్లిలో నిర్వహిస్తున్నారు. పార్టీలకతీతంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో వివిధ పార్టీల నేతలతో పాటు సినీ హీరోలు పాల్గొననున్నారు. కూకట్‌పల్లిలోని ఖైతలాపూర్ స్టేడియంలో సాయంత్రం 5 గంటల నుంచి ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా కూకట్ పల్లి పరిధిలో పోలీసులు ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 5 గంటలకు వేడుకలు ప్రారంభం కానుండగా.. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. మూసాపేట్ నుంచి కేపీహెచ్‌బీ-IV ఫేజ్, హైటెక్ సిటీ వైపు వెళ్లే వాహనాలను మూసాపేట్ క్రాస్ రోడ్, కూకట్ పల్లి బస్టాఫ్, జేఎన్టీయూ జంక్షన్ వైపు మళ్లించనున్నారు. ఇక ఐడీఎల్ లేక్ నుంచి మాదాపూర్ హఫీజ్‌పేట వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఐడీఎల్ జంక్షన్, కూకట్‌పల్లి బస్టాఫ్, కేపీహెచ్‌బీ రోడ్ నెంబర్ 1, జేఎన్టీయూ జంక్షన్ వైపు మళ్లిస్తారు.

హైటెట్ సిటీ నుంచి కూకట్ పల్లి, మూసాపేట్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను కేపీహెచ్‌బీ-IV ఫేజ్, లోథా అపార్ట్‌మెంట్స్, కేపీహెచ్‌బీ రోడ్ నెంబర్ 1 వైపు దారి మళ్లిస్తారు. ఇక పర్వతనగర్, మాదాపూర్ నుంచి కూకట్‌పల్లి, మూసాపేట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఎస్‌బీఐ సిగ్నల్, 100 ఫీట్ సిగ్నల్ దగ్గర దారి మళ్లిస్తారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.