NTR: ఆ ఒక్క లోటు ఎన్టీఆర్ ను ఎంతో భాదిస్తుందట.. అదేంటో తెలుసా..
ఇండస్ట్రీలో తన మేలు కోరుకునే శ్రేయోభిలాషులతో.. తన ఫిల్మ్ కెరీర్లో ఎన్నో శిఖరాలను ఎక్కేలా ఉన్నారు. కానీ అలాంటి ఎన్టీఆర్ మాత్రం తన జీవితంలో తీరని లోటు.. నాన్న ప్రేమే అని ఎప్పుడూ అంటూ ఉంటారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ హీరో..! టాలీవుడ్ నుంచి గ్లోబల్ రేంజ్‌కు వెళ్లిన హీరో! తనకు జన్మనిచ్చిన అమ్మతో.. అర్థం చేసుకునే అర్థాంగితో.. ఇద్దరు అందమైన పిల్లలతో.. కష్టపడి సంపాదిస్తున్న డబ్బుతో.. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు ఈ హీరో. దానికి తోడు అభిమానుల చూపించే ప్రేమతో.. ఇండస్ట్రీలో తన మేలు కోరుకునే శ్రేయోభిలాషులతో.. తన ఫిల్మ్ కెరీర్లో ఎన్నో శిఖరాలను ఎక్కేలా ఉన్నారు. కానీ అలాంటి ఎన్టీఆర్ మాత్రం తన జీవితంలో తీరని లోటు.. నాన్న ప్రేమే అని ఎప్పుడూ అంటూ ఉంటారు. ఇప్పుడు అదే మాటలతో … అప్పటి వీడియోతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నాన్న హరి కృష్ణ అంటే.. భయం భక్తి ప్రేమతో ఉండే వారు. తన ఆడుగుజాడల్లోనే నడిచే వారు. ఇదే విషయాన్ని చాలా ఇంటర్వ్యూల్లో.. చెప్పారు. చాలా వేదికల్లో మెన్షన్ చేశారు. కానీ తాను అంత ప్రేమించే తండ్రి ఉన్నట్టుండి హఠాత్తుగా తనను విడిచి వెళ్లిపోయారు. కారు యాక్సిడెంట్‌లో విగతజీవిగా మారిపోయారు.
ఇక ఇది తట్టుకోలేని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా బాధతో చాలా రోజులు ఇంటికే పరిమితమయ్యారు. ఆ తరువాత సినిమాల్లో బిజీ అయినప్పటికీ.. తన అభిమానులను కలిసిన ప్రతీ సారీ.. వారికి జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు. ప్రమాణాలు చేస్తున్నప్పుడు.. ఇంటికి జాగ్రత్తగా వెళ్లాలని అంటూనే ఉంటారు. ఇంట్లో మీకంటూ ఉన్న కుంటుంబం ఎదురుచూస్తూ ఉంటుంది.. జాగ్రతమ్మా అంటూ.. తన ప్రతీ అభిమానికి పేరుపేరున చెప్పే ప్రయత్నం చేస్తుంటారు.