News

NTR 30: నెక్ట్స్ సినిమా చెయ్య‌ట్లేదు.. ఆపేస్తాను కూడా..ఫ్యాన్‌కి ఎన్టీఆర్ ఆన్స‌ర్‌ – jr ntr reaction about his ntr 30 in daas ka dhamki


Jr Ntr – NTR 30: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ NTR 30 కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ వ‌చ్చి ఏడాది దాటేసింది. తార‌క్ ఏమో త‌న సినిమా షూటింగ్‌నే స్టార్ట్ చేయ‌లేదు. ఈ విష‌యంపై ఫ్యాన్స్‌లో టెన్షన్ నెల‌కొంది. అలాగ‌ని ఆయ‌నేమీ ఊరక‌నే కూర్చో లేదు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నారు. ఈ విష‌యంపై ఇప్ప‌టికే మేక‌ర్స్ ప‌లు మార్లు ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చేశారు. అయితే ఎప్పుడ‌నే విష‌యంపైనే అంద‌రిలోనూ ఉత్కంఠ‌త నెల‌కొంది.

తాజాగా ఎన్టీఆర్ విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం దాస్ కా ధ‌మ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా వ‌చ్చారు. ఈ వేడుక‌లో ఓ అభిమాని ఎన్టీఆర్ 30 గురించి అప్‌డేట్ ఇవ్వాలంటూ గ‌ట్టిగా అరిచాడు. దానికి ఎన్టీఆర్ రియాక్ట్ అవుతూ ‘‘నేను నెక్ట్స్ సినిమా చెయ్యట్లేదు. ఏమి..ఎన్నిసార్లు చెప్తారు. మొన్ననే చెప్పానుగా. మీరు ఇలాగే అడిగితే నెక్ట్స్ సినిమా చెయ్యట్లేదనే చెప్పా.. అపేస్తాను కూడా’’ అని సరదాగా నవ్వుతూ అన్నారు. ‘తర్వాత కంటిన్యూ చేస్తూ నేనెలా ఆపేస్తాను. నేను ఆపేస్తే మీరు ఊరుకుంటారా..త్వరలోనే ఉంటుంది’ అని అన్నారు ఎన్టీఆర్.

NTR 30 సినిమాను ఈ వారంలోనే స్టార్ట్ చేస్తార‌ని అంటున్నారు. ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్ష‌కులు కూడా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. సైఫ్ ఆలీఖాన్ ప్ర‌తి నాయ‌కుడిగా న‌టిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న ఎన్టీఆర్ 30న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే మేక‌ర్స్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేశారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌రికృష్ణ‌, సుధాక‌ర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ALSO READ: Siva Krishna: అది వెబ్ సిరీస్ కాదు బ్లూ ఫిల్మ్‌.. సీనియర్ నటుడు శివ కృష్ణ ఫైర్‌

  • Read latest Tollywood updatesand Telugu News

Related Articles

Back to top button