Entertainment

Bollywood Remakes: సౌత్ ఎమోషన్స్‌ను కిల్ చేస్తున్న నార్త్ మేకర్స్‌.. ఏందబ్బా ఇది


కంటెంట్‌ కన్నా యాక్షన్‌ పార్ట్‌కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మేకర్స్. కంటెంట్ కిల్ చేసి.. కేవలం ఫైట్స్‌తో నింపేస్తున్నారు.

Bollywood Remakes: సౌత్ ఎమోషన్స్‌ను కిల్  చేస్తున్న నార్త్ మేకర్స్‌.. ఏందబ్బా ఇది

Ajay Devgn’s Bholaa Movie

సౌత్‌లో సూపర్ హిట్ అయిన సినిమాలను నార్త్‌లో రీమేక్ చేయటం అన్నది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. అయితే ఆ రీమేక్‌ చేస్తున్న తీరు మీదే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇక్కడ ఎమోషనల్‌ డ్రామాలుగా తెరకెక్కిన సినిమాలను హిందీలో యాక్షన్ సినిమాలుగా మార్చి సోల్‌ను దెబ్బ కొడుతున్నారన్న కంప్లయింట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా రిలీజ్‌కు రెడీ అవుతున్న మూవీ విషయంలోనే ఇదే జరుగుతోంది.

కార్తీ హీరోగా లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఖైదీ. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను ఇప్పుడు హిందీలో భోళా పేరుతో రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ స్టార్ అజయ్ దేవగన్‌ స్వయంగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ మూవీ విషయంలో సౌత్ ఆడియన్స్‌ పెదవి విరుస్తున్నారు. రీసెంట్‌గా భోళా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అయితే ఈ ట్రెలర్‌లో కంటెంట్‌ కన్నా యాక్షన్‌ పార్ట్‌కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు మేకర్స్. ఒరిజనల్ వర్షన్‌లో రెండు, మూడు సాలిడ్ యాక్షన్ సీన్స్ మాత్రమే ఉన్నాయి. మిగతా సినిమా అంతా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఎమోషనల్‌ డ్రైవ్‌లా సాగుతుంది.

ఖైదీ నార్త్ వర్షన్‌ను పూర్తిగా మార్చేశారు మేకర్స్. ట్రైలర్‌ చూస్తే సినిమా అంతా ఓ యాక్షన్‌ జర్నీలా అనిపిస్తుంది. దీంతో విజువల్స్ పరంగా భోళా గ్రాండ్‌గా అనిపించినా… ఖైదీలా మనసును తాకే ఛాన్స్ లేదంటున్నారు సౌత్ సినీ జనాలు. గతంలోనూ కొన్ని సౌత్‌ సినిమాలను ఇలాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌గా మార్చేశారు నార్త్ మేకర్స్‌. ముఖ్యంగా టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన సౌత్ రీమేక్స్ విషయంలో ఇలాంటి మార్పులు ఎక్కువగా జరుగుతున్నాయి.

సౌత్‌లో సూపర్ హిట్ అయిన వర్షం, క్షణం, తడాకా సినిమాలను హిందీలో రీమేక్‌ చేసిన టైగర్‌.. ఆ సినిమాల్లో కథ మొత్తాన్ని పక్కన పెట్టేసి యాక్షన్‌ సీన్స్‌తో నింపేశారు. ఇప్పుడు భోళా విషయంలోనూ అదే జరుగుతుండటంతో ఈ సినిమా రిజల్ట్ విషయంలో అనుమానాలు కలుగుతున్నాయి.



Advertisement

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button