News

Nominee,Mutual Funds: ఇన్వెస్టర్లకు అలర్ట్.. అందుకు సెప్టెంబర్ 30 ఆఖరు తేదీ.. ఇప్పుడే పూర్తి చేయండి! – give nominee details for mutual funds by september 30 to avoid mf folio frozen


Mutual Funds: మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే, ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. సెప్టెంబర్ 30 తేదీ పూర్తయ్యే నాటికి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు నామినీని తప్పనిసరిగా ఎంపిక చేయాలి. లేకపోతే తమకు నామినీ అవసరం లేదనైనా డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే మీ ఫండ్ ఫోలియో ఖాతా స్తంభించిపోయే అవకాశం ఉంది. దాని ఫలితంగా ఇప్పటి వరకు చేసిన పెట్టుబడి, దానిపై వచ్చే రాబడిని తిరిగి పొందడం కష్టమవుతుంది. ఇప్పటికే మార్చి 31తో ఈ గడువు ముగిసినప్పటికే సెప్టెంబర్ 30, 2023 వరకు పొడిగించారు.

గత ఏడాది జూన్ 15నే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది. నామినీని ఎంపిక చేయడం లేదా అవసరం లేదైనా డిక్లరేషన్ సమర్పించాలని సూచించింది. అంతకు ముందు ఇందుకు 2022, ఆగస్టు 1 వరకు గడువు విధించగా.. ఆ తర్వాత రెండు దఫాల్లో గడువు మార్చి 31కి పొడిగించారు. తర్వాత సెప్టెంబర్ 30 వరకు అవకాశం కల్పంచారు. గతంలో ఎంఎఫ్ అకౌంట్లు తెరిచేటప్పుడే చాలా మంది నామినీలను ఎంపిక చేయలేదని నిపుణులు తెలుపుతున్నారు. ఫలితంగా వారికి ఏమైనా అయితే, సొమ్మును క్లెయిం చేసుకోవడానికి వారి చట్టబద్ధమైన వారసులకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయని వివరించారు. కొంత మంది అసలు తాము ఎంఎఫ్ ఖాతాలు తెరిచినట్లు కూడా ఇంట్లో చెప్పడం లేదని పేర్కొన్నారు. నామినీలను ఎంపిక లేదా అవసరం లేదని డిక్లరేషన్ సమర్పించడానికి మ్యూచువల్ ఫండ్ సంస్థలు తమ కస్టమర్లకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని గతంలోనే సెబీ ఆదేశించింది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో పత్రాలు సమర్పించేందుకు వెసులుబాటు కల్పించాలని సూచించింది.

డీఎస్‌పీ కస్టమర్లు ముందుగా డీఎస్‌పీ వెబ్‌సైట్ లోకి లాగిన్ కావాలి.
ఫోలియోస్‌లోకి వెళ్లాలి. అందులో హోల్డర్స్ వివరాల్లో యాడ్ నామినీ వివరాలు అనే యాప్షన్ ఎంచుకోవాలి.
లేకపోతే బ్రాంచుకు వెళ్లి నామినీ వివరాలు అందించవచ్చు.
మరోవైపు.. క్యామ్స్ (CAMS) కస్టమర్లకు http://bit.ly/3Q6d0Tl ద్వారా తమ నామినీ వివరాలు లేదా డిక్లరేషన్ ఇవ్వవచ్చు.
వెబ్‌సైట్ లోకి వెళ్లిన తర్వాత యాడ్ నామినీ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పటికే నామినీ వివరాలు ఇచ్చినవారు సైతం ఆ వివరాలను అప్డేట్ చేసకోవచ్చు.

Also Read: 2 రూపాయలు, 6 రూపాయల షేర్లే.. ఒక్కరోజే 20 శాతం జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల పంట!

ఈ పోస్టాఫీస్ పథకంతో ఒకేసారి చేతికి రూ.17 లక్షలు.. రోజుకు ఇంత కడితే చాలు.. లోన్ ఫెసిలిటీ

  • Read Latest Business News and Telugu News

Related Articles

Back to top button