Nizam assets: వారసత్వంగా వచ్చిన నిజాం సంపద సంగతి ఏంటి..? వివాదాల్లో చిక్కుకున్న నిజాం ఆస్తులు.. | What about the Nizam’s inherited wealth and full details about Nizam assets Telugu News video
ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన కుమారులు ఆజాం జాహి, మోజాంజాహిలను కూడా కాదని తన మనవడిని వారసుడిగా ప్రకటించారు. నిజాం మొదటి కుమారుడు ఆజాం జాహి, ప్రిన్స్ దుర్రెషహర్ దంపతుల
ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన కుమారులు ఆజాం జాహి, మోజాంజాహిలను కూడా కాదని తన మనవడిని వారసుడిగా ప్రకటించారు. నిజాం మొదటి కుమారుడు ఆజాం జాహి, ప్రిన్స్ దుర్రెషహర్ దంపతుల రెండో కుమారుడే ప్రిన్స్ ముఖరంజా. తాత నుంచి వారసత్వంగా వచ్చిన సంపదతో చిన్న వయసులోనే ప్రపంచ కుబేరుడయ్యాడు. హైదరాబాద్ లో ఉన్న కోట్లాది రూపాయల ఆస్తులు, ప్యాలెస్‌లకు హక్కుదారుడు. నిజాం చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఏడో నిజాం ఇతడిని వారసుడిగా ప్రకటించగానే నాటి భారత్ ప్రధాని ఎన్నో గౌరవ పదవులను ఆఫర్ చేశాడు. కానీ ప్రిన్స్ ముఖరంజా వాటన్నింటిని కాదని తన అమ్మమ్మ దేశమైన టర్కీకి వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అక్కడ విలాసవంతమైన జీవితం గడిపాడు. ఆస్ట్రేలియాలోని వేలాది ఎకరాల అడవుల్లో షీప్ ఫామ్స్ పెట్టాడు. చుట్టపు చూపుగా ఏడాదికొకసారి హైదరాబాద్ వస్తూ తన ఆస్తులను చూసుకొని పోతుండేవాడు. వచ్చినప్పుడల్లా బంజారాహిల్స్ లోని చిరాన్ ప్యాలెస్‌లో బస చేసేవారు. అయితే హైదరాబాద్‌లో కొన్ని ఆస్తులకు సంరక్షకులుగా ఉన్న వారు.. వాటిని అతనికి తెలియకుండా అమ్ముకున్నారు. మరోవైపు నిజాంకు ఉన్న ఆస్తులన్ని వివాదాల్లో చిక్కుకున్నాయి. చేతిలో ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఒకప్పటి ప్రపంచ కుబేరుడు దివాళా తీశాడు. ప్రస్తుతం నిజాం అస్తుల లెక్కలు తేలాల్సి ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నూర్ మహమ్మద్ అందిస్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.