Entertainment

Nikhil Siddhartha: ‘అమిత్ షా పిలిచారు.. కానీ ఆ కారణంగానే వెళ్లలేదు’.. నిఖిల్ సిద్ధార్థ్ ఆసక్తికర వ్యాఖ్యలు..


ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమా స్పైతో రాబోతున్నాడు నిఖిల్. ఇందులో ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తోంది. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను ఎడిటల్ గ్యారీ రూపొందిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫాంలో ఉన్న హీరోలలో నిఖిల్ సిద్ధార్థ్ ఒకరు. ఈ ఏడాది కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ముఖ్యంగా కార్తికేయ 2 చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమా స్పైతో రాబోతున్నాడు నిఖిల్. ఇందులో ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తోంది. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను ఎడిటల్ గ్యారీ రూపొందిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా చిత్రయూనిట్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించగా సినిమా గురించి అనేక విషయాలు తెలిపారు.

మొన్న కార్తికేయ 2, ఇప్పుడు స్పై. మీరు ఓ పార్టీకి అనుకూలంగా ఈ సినిమాలు చేస్తున్నారా ?.. అమిత్ షా మిమ్మల్ని కలవాలని పిలిచారంట కదా అని ఓ విలేకరి అడగ్గా.. నిఖిల్ స్పందిస్తూ.. “ఇది సుభాష్ చంద్రబోస్ గారి సినిమా. కార్తికేయ కృష్ణుడికి సంబంధించింది . నేను నేను చిన్నప్పటి నుంచి కృష్ణుడిని పూజిస్తాను కాబట్టి ఆ స్టోరీ చేశాను. ఇక నాకు వచ్చిన కథల్లో ఈ కథ బాగా నచ్చి సెలెక్ట్ చేసుకున్నాను. నేను చిన్నప్పుడే సుభాష్ చంద్రబోస్ గెటప్స్ వేసాను. నా ధర్మాన్ని నేను నమ్ముతాను. నేను ఇండియన్ ని, ఇది ఇండియన్ సినిమా. నాకు సినిమాలు చేయమని ఎవరూ డబ్బులు ఇవ్వట్లేదు, ఏ పార్టీ ఇవ్వట్లేదు. అమిత్ షా గారి నుంచి నాకు ఆహ్వానం వచ్చినమాట నిజమే. కానీ నేను ఆయన్ని కలిస్తే మళ్ళీ రాజకీయంగా చూస్తారనే నేను వెళ్లలేదు. నేను ఏ రాజకీయ పార్టీ కి సంబందించిన వ్యక్తిని కాను.”

ఇవి కూడా చదవండి



‘కార్తికేయ 2 చూశాక నన్ను నన్ను అందరూ, అన్ని పార్టీల వారు అభినందించారు. ఈ సినిమాను కూడా అన్ని ప్రభుత్వాలకి, అందరు రాజకీయ నాయకులకు చూపిస్తాము, మీడియాకు కూడా ఓ షో వేస్తాము’ అని తెలిపారు. ప్రస్తుతం నిఖిల్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button