Entertainment

Karthikeya 2: కార్తికేయ 2 వినూత్న ప్రచారం.. కాంటెస్ట్ గెలిస్తే ఏకంగా రూ. 6 లక్షలు.. ఏలాగంటే..


యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తోన్న కార్తికేయ 2 (Karthikeya 2) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కేరళ కుట్టి అనుపమ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ ట్రైలర్‏కు అద్భుతమైన స్పందన వచ్చింది. అంతేకాకుండా.. మరోవైపు సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో […]

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తోన్న కార్తికేయ 2 (Karthikeya 2) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కేరళ కుట్టి అనుపమ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ ట్రైలర్‏కు అద్భుతమైన స్పందన వచ్చింది. అంతేకాకుండా.. మరోవైపు సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో తాజాగా కార్తికేయ 2 మూవీ ప్రమోషన్స్ కాస్త విభిన్నంగా స్టార్ట్ చేశారు మేకర్స్.

ఈ సినిమాకు వినూత్నమైన ప్రచారం మొదలుపెట్టారు దర్శక నిర్మాతలు. దీని కోసం సపరేటుగా ఒక కాంటెస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతిలో ఈ కాంటెస్ట్ రన్ చేస్తున్నారు. ఈ మిస్టికల్ టెస్ట్ లో గెలుపొందిన విజేతలకు ఆరు లక్షల విలువ గల ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే హైదరాబాదులో మొదటి క్లూ విడుదల చేశారు. ఒక్కొక్కటిగా మరికొన్ని క్లూస్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ ప్రచారంతో సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగిపోతుంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button