Entertainment

Karthikeya 2: మరో‌సారి వాయిదా పడిన నిఖిల్ సినిమా..కార్తికేయ 2 వచ్చేది అప్పుడే..


యంగ్ హీరో  నిఖిల్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ కార్తికేయ 2(Karthikeya 2). క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొన‌సాగిస్తూ విజ‌యాలు సొంతం చేసుకుంటున్న‌ క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై ఈ సినిమా పై నిర్మితం అవుతుంది.

యంగ్ హీరో  నిఖిల్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ కార్తికేయ 2(Karthikeya 2). క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొన‌సాగిస్తూ విజ‌యాలు సొంతం చేసుకుంటున్న‌ క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై ఈ సినిమా పై నిర్మితం అవుతుంది.  ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ చిత్రాన్ని  టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్  సంయుక్తంగా కార్తికేయ 2 నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది.. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం’ అంటూ అదిరిపోయే డైలాగ్స్ తో సాగే ట్రైలర్ 1 ఆకట్టుకుంటుంది.విడుదలైన ట్రైలర్ 1కు ఈ సినిమా పై వచ్చిన అంచనాలకు మించే స్థాయిలో ఈ థియేట్రికల్ ట్రైలర్ ఉండనుంది. ఆగష్టు 6నా కార్తికేయ 2 థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఆగస్ట్ 13న విడుదల కానుంది కార్తికేయ 2. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

హీరో నిఖిల్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు వర్క్ చేసిన శ్రీనివాస్ రెడ్డి,ప్రవీణ్, వైవా హర్ష,సత్య  వీరందరూ అరిస్టులు హీరోలుగా బిజీగా ఉన్నా ఈ కథను, కాన్సెప్ట్, నమ్మి, ఏర్పాటు సినిమాను నమ్మి మాతో ట్రావెల్ అయ్యారు.షూటింగ్ టైమ్ లో గాని షూటింగ్ తరువాత గానీ అందరూ చాలా సపోర్ట్ చేశారు. నిర్మాతలు విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిబొట్ల, మయాంక్ గార్లు అందరూ మమ్మల్ని, చందు మొండేటి గారిని నమ్మి రెండు ప్యాండమిక్ స్విచ్వేషన్స్ వచ్చినా ఆ టైమ్ లో ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయకుండా ఈ సినిమాను తెరకేక్కించారు. క్రియేటివ్ టీం కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆగష్టు 13 న వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని చెప్పగలను. మేము విడుదల చేసిన “కార్తికేయ 2” ట్రైలర్ 1 కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరినుండి కూడా మంచి అప్రిసియేషన్స్ వస్తున్నాయి. మీ సినిమా ఎలా ఉన్నా థియేటర్ కు వచ్చి సినిమా చూస్తాము అని కామెంట్స్ వస్తున్నాయి. మాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు.థియేటర్ ద్వారా ప్రేక్షకులకు గ్రాండ్ గా బిగ్ స్క్రీన్ పై మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని  తీసిన సినిమా ఇది.అందుకే నేను ఈ మధ్య  థియేటర్,థియేటర్ అంటున్నాను. ఈ సినిమా కు మేము గ్రాఫికల్ షాట్స్ గాని, మంచి లొకేషన్స్ గానీ సెలెక్ట్ చేసుకొని గ్రీస్, గుజరాత్, కష్మీర్, ఇలా అనేక ప్రదేశాలలో తీశాము. ఇప్పుడే మా సినిమా ఓటిటి లో రాదు. ఆగష్టు 13 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు అందరూ  థియేటర్స్ కు వచ్చి చూడండి. తప్పకుండా మీకు ఒక కొత్త అనుభూతిని పొందుతారు. టీజర్, ట్రైలర్ బాగుంటేనే ఆడియన్స్ థియేటర్స్ కు వస్తారు. మేము 6 న ట్రైలర్ 2 ను రిలీజ్ చేస్తున్నాము అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button