Liger: లైగర్ నుంచి మరో రొమాంటిక్ సాంగ్.. ఆకట్టుకుంటున్న అఫత్ పాట..
ఇందులో విజయ్ మరింత మాస్ లుక్ లో కనిపించాడు. తాజాగా రిలీజ్ అయిన అఫత్ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లైగర్ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో రొమాంటిక్ సాంగ్ అఫత్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో విజయ్ మరింత మాస్ లుక్ లో కనిపించాడు. తాజాగా రిలీజ్ అయిన అఫత్ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే విడుదలైన అక్డీ పక్డీ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నికార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మాస్ డైరెక్టర్ జగన్నాథ్ కాంబోలో విజయ్, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇందులో రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.
వీడియో..
Vibe to the most electric song of the year #AAFAT 💞
▶️ https://t.co/yHkGSmd8x6#LIGER #LigerOnAug25th pic.twitter.com/otJw78WvHT
Advertisement— Vijay Deverakonda (@TheDeverakonda) August 6, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి