News

New Parliament Building,Parliament Building: కొత్త పార్లమెంటు భవనంలో సమావేశాలు.. మరి పాత పార్లమెంటును ఏం చేస్తారు? – lok sabha rajya sabhas into new parliament building what happens to old parliament building


Parliament Building: పార్లమెంటు కొత్త భవనాన్ని ఇటీవలె ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అయితే సోమవారం వరకు ఉభయ సభల సమావేశాలు పాత పార్లమెంటు భవనంలోనే జరిగాయి. అయితే మంగళవారం రోజు కొత్త పార్లమెంటు భవనంలోకి లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సహా ఇరు సభల ఎంపీలు అంతా కొత్త పార్లమెంటు భవనంలోకి వచ్చి సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం నుంచి అధికారికంగా కొత్త పార్లమెంటు భవనంలో సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చర్చ అంతా పాత పార్లమెంటు భవనంపై జరుగుతోంది. ఇప్పుడు పార్లమెంటు ఉభయ సభలు కొత్త బిల్డింగ్‌లోకి మారిపోయిన నేపథ్యంలో పాత బిల్డింగ్‌ను ఏం చేస్తారు అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది.

కొత్త పార్లమెంట్ భవనానికి 2020 డిసెంబర్ 10 వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది మే నెల 28 వ తేదీన ప్రధాని మోదీ ఆ భవనాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ కొత్త భవనం అత్యంత భద్రత, ఆధునికంగా నిర్మించడమే కాకుండా ఎన్నో విశిష్ఠతలను కలిగి ఉంది. పాత పార్లమెంటు భవనం కంటే ఎంతో పెద్దదైన కొత్త పార్లమెంటులో ఎన్నో అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. పాత పార్లమెంట్ భవనంలో ఎంపీలు కూర్చునే ఏర్పాట్లతో పాటు లైబ్రరీ, లాంజ్, ఛాంబర్లు ఉన్నాయి. ఇవే కాకుండా ఎంపీలు, జర్నలిస్టులకు సబ్సిడీపై ఆహారం అందించే క్యాంటీన్ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ చారిత్రక భవనాన్ని ఏం చేయనున్నారని చాలా మందిలో ప్రశ్నలు మెదులుతున్నాయి.

పాత పార్లమెంటు భవనాన్ని 1927 లో బ్రిటిష్ వాస్తు శిల్పులు సర్ ఎడ్విన్ లుటియన్స్, హెర్బర్ట్ బేకర్ నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనానికి 97 ఏళ్లు నిండాయి. అయితే కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం పాత భవనాన్ని కూల్చివేయకుండా మరమ్మతులు చేయించి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయనున్నారు. ఈ పాత పార్లమెంటు భవనాన్ని పునరుద్ధరించి ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు పేర్కొన్నాయి. భారత పార్లమెంటరీ చరిత్రను దేశ ప్రజలు తెలుసుకునేలా భవనంలోని కొంత భాగాన్ని మ్యూజియంగా మార్చనున్నట్లు తెలుస్తోంది.

ఈ భవనాన్ని భారతదేశ ముఖ్యమైన చారిత్రక వారసత్వ సంపదగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇక పార్లమెంటు పాత భవన పునరుద్ధరణ కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వారు ఆ భవనానికి సంబంధించిన బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ భవనంలోని నేషనల్ ఆర్కైవ్స్ కొత్త భవనానికి తరలించనున్నారు. దీంతో పాత భవనంలోని ఈ స్థలాన్ని సమావేశ గదిగా లేదా ఇతర ప్రయోజనాల కోసం వాడుకోనున్నారు.

పార్లమెంట్ కొత్త భవనంలో ఎంపీల కోసం ఛాంబర్, విశ్రాంతి స్థలం, లైబ్రరీ, క్యాంటీన్ వంటి అనేక ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. కొత్త పార్లమెంట్ భవనం మొత్తం 64,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో లోక్‌సభకు 880 సీట్లు, రాజ్యసభకు 300 సీట్లు ఉన్నాయి. ఉమ్మడి సమావేశానికి 1280 సీట్లను ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో నియోజక వర్గాల పునర్విభజన చేసినా.. సభ్యులందరూ కూర్చునేందుకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఈ భవనాన్ని నిర్మించారు. సౌండ్ సెన్సార్‌లతో సహా అత్యాధునిక సాంకేతికత కలిగిన ఈ కొత్త పార్లమెంటు భవనంలో భద్రత కోసం అనేక లేయర్‌లు ఉపయోగించారు.

Sonia Gandhi: మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియాగాంధీ స్పందన.. అది మాదేనని వ్యాఖ్య
Cabinet Meeting: మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. కీలక బిల్లుకు కేబినెట్ ఆమోదం!

Read More Latest National News And Telugu News

Advertisement

Related Articles

Back to top button