News
nayara energy, Petrol Price: వాహనదారులకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్.. ఎక్కడంటే? – petrol price nayara energy sells petrol diesel at re 1 less than govt companies
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం వంటి ప్రభుత్వ కంపెనీలు ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయడం లేదు. దీంతో ధరలు దిగి రావడం లేదు. అయితే, ప్రైవేటు కంపెనీలు మాత్రం ధర తగ్గింపు రూపంలో ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు కల్పిస్తున్నాయి. జూన్ నెల చివరి వరకు రూ.1 డిస్కౌంట్‌తో పెట్రోల్, డీజిల్ కొట్టించుకోవచ్చని నయారా ఎనర్జీ వెల్లడించింది. దీంతో దేశీయ డిమాండ్ పెరుగుతుందని అంచనా వేసింది.
దేశంలో 86 వేలకుపైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిల్లో 7 శాతం వరకు నయారా ఎనర్జీ కలిగి ఉంది. ఇకపై ఆయా బంకుల్లో ప్రభుత్వ బంకుల్లో కన్నా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.1 తక్కువగా కొట్టించుకోవచ్చు. మే నెల ఆరంభంలోనే రిలయన్స్ బీపీ కూడా రూ.1 తక్కువకే డీజిల్ అందించింది. అయితే, కేవలం డీజిల్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. కానీ, నయారా ఎనర్జీ మాత్రం పెట్రోల్, డీజిల్ రెండింటికీ డిస్కౌంట్ రేటును అందిస్తోంది. ప్రైవేటు చమురు రిటైలర్లు ధరలు తగ్గిస్తున్న క్రమంలో ప్రభుత్వ ఆయిల్ రిటైల్ కంపెనీలు సైతం తగ్గించవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
- Read Latest Business News and Telugu News