Entertainment

Hit 2 Movie: హిట్‌ 2పై క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన నాని.. విడుదల తేదీ ప్రకటిస్తూ ట్వీట్‌..


Hit 2 Movie: శైలేష్‌ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్‌ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రైం ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందించింది…

Hit 2 Movie: శైలేష్‌ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్‌ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రైం ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందించింది. విశ్వక్‌సేన్‌ తనదైన నటనతో ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. హిట్2 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అడివి శేష్‌ హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాను న్యాచురల్ స్టార్‌ నాని సమర్పిస్తుండడం విశేషం.

ఇక ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంటో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 2021 ఈ సినిమా షూటింగ్ మొదలుకాగా అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్ ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. నాని స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా తెలిపాడు. రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను ట్వీట్ చేసిన నాని.. ‘డిసెంబర్‌ 2వ తేదీన, సెకండ్ కేస్‌’ అని రాసుకొచ్చాడు.

దీంతో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌ ఎదురుపూలుకు ఫుల్‌స్టాప్‌ పడినట్లైంది. ఈ సినిమాలో అడివి శేష్‌కు జోడిగా. మీనాక్షి చౌద‌రి నటిస్తుండగా.. రావు రమేశ్‌, భాను చంద‌ర్‌, పోసాని కృష్ణ ముర‌ళి, త‌నికెళ్లభ‌ర‌ణి, శ్రీనాథ్ మాగంటి, కోమ‌లీ ప్రసాద్ కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button