Entertainment

Hyderabad: అన్ని మల్టీప్లెక్సుల్లో రూ. 75కే మూవీ టికెట్‌.. ప్చ్‌.. మనకు మాత్రం ఆ లక్కీ ఛాన్స్‌ లేదు బాస్‌..


Hyderabad: మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నేషనల్ సినిమా డేను నిర్వహిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశంలోని అన్ని మల్టిప్లెక్సుల్లో రూ. 75కే మూవీ టికెట్స్‌ పొందే అవకాశాన్ని..

Hyderabad: మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నేషనల్ సినిమా డేను నిర్వహిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశంలోని అన్ని మల్టిప్లెక్సుల్లో రూ. 75కే మూవీ టికెట్స్‌ పొందే అవకాశాన్ని కల్పించింది. నిజానికి తొలుత సెప్టెంబర్‌ 23 తేదీన ‘నేషనల్ సినిమా డే’ను నిర్వహిస్తున్నట్లు మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. అయితే తర్వాత కొన్ని కారణాలతో ఈ తేదీని 23 తేదీకి మార్చింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న 4000 మల్టీప్లెక్సుల్లో కేవలం రూ. 75కే టికెట్‌ను సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

ఈ వార్త తెలిసిన మూవీ లవర్స్‌ ఖుషీ అవుతున్నారు. అయితే అంతా బాగానే ఉన్నా సౌత్‌ మూవీ లవర్స్‌కి మాత్రం ఈ అవకాశం దక్కలేదు. ప్రముఖ మల్టీప్లెక్స్‌ సంస్థ పీవీఆర్‌ సౌత్‌లో ఈ ఆఫర్‌ ఇవ్వడం లేదని ప్రకటించింది. హైదరాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌, గుంటూరు, విజయవాడ, నర్సీపట్నం, చెన్నై, కొచ్చి, త్రివంద్రం, వెల్లూరు, చంఢీగఘడ్‌, కొయంబత్తూరులో ఈ ఆఫర్‌ ఉండదని ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్‌ నిరాశ చెందుతున్నారు.

రూ. 112కే మూవీ టికెట్‌..

ఇదిలా ఉంటే నేషనల్‌ సినిమా డే రోజున బుక్‌ మై షో మల్టీప్లెక్సుల్లో టికెట్లపై కొంతమేర డిస్కౌంట్‌ ప్రకటించింది. సెప్టెంబర్‌ 23న ఎంపిక చేసిన కొన్ని సినిమాలకు టికెట్‌ను రూ. 112కి అందిస్తున్నాయి. అయితే ఇవి కేవలం కొన్ని మల్టీప్లెక్సుల్లో ప్రదర్శితమవుతోన్న సినిమాలకు మాత్రమే పరిమితం చేసింది.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button