News

narsingi accident today, Narsingi: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి – four killed on the spot in narsingi road accident in medak district


Narsingi Accident: మెదక్ జిల్లా నార్సింగి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం ప్రయాణికులతో వెళ్తోన్న ఓ ఆటోను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు అక్కడిక్కకడే మృతి చెందారు. ఆటో ఆర్మూర్ నుండి గజ్వేల్‌కు వెళ్తుండగా ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతులు ఆర్మూర్ మండలం ఏలూరుకు చెందిన వారిగా గుర్తించారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరిలించారు. రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కారు మీతిమీరిన వేగంతో ఆటోను ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వ్యాన్ టైర్ పేలి ముగ్గురు..
జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం పూడూరు దొంగల మర్రి వద్ద మరో ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మామిడికాయల లోడ్‌తో వెళ్తున్న మిని వ్యాన్ టైర్ పేలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ స్పాట్‌లోనే మృతి చెందగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రయాణ సమయంలో వ్యాన్‌లో మెుత్తం 11 మంది కూలీలు ఉండగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

రెండ్రోజుల క్రితం నార్సింగి సీబీఐటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రోడ్డు పక్కన ఆగిఉన్న టిప్పర్ లారీని కారు ఢీకొన్న ఘటనలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మగ్గురు స్పాట్‌లోనే చనిపోగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మృతులంతా ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు తెలిసింది. హైదరాబాద్ కూకట్ పల్లి, బాచుపల్లి, నిజాంపేట చెందిన కొంత మంది స్నేహితులు హాలీడేస్‌లో ఎంజాయ్ చేయటం కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయారు.

సీబీఐటీ కాలేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

సెవన్ సీటర్ కారు రెంట్‌కు తీసుకొని ఈనెల19న 12 మంది విద్యార్థులు నగరశివారుకు బయల్దేరారు. ఈ క్రమంలో ఓ బస్సును ఓవర్‌టెక్ చేయబోయి.. రోడ్డు పక్కనే ఆగిఉన్న టిప్పర్‌ను ఢీకొట్టారు. ప్రమాద సమయంలో కారు స్పీడు 100 కిలోమీటర్లుగా నమోదైంది. అయితే కారులోని ఎయిర్‌బెలూన్స్ తెరుచుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. వారు ప్రయాణిస్తున్న స్పీడ్‌కు కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదస్థలంలోనే హర్షిత, అంకిత అనే సొంత అక్కాచెల్లెళ్లతో పాటు నితిన్ మృతి చెందాడు. అమృత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కారు నడిపిన ప్రసాద్ బ్రెయిన్ డెడ్ అయినట్లు తెలిసింది.

  • Read More Telangana News And Telugu News

Related Articles

Back to top button