News
nara lokesh, జగన్ రెడ్డి పాలనలో సెటిల్మెంట్లు, కబ్జాలకి సీఐడీ అడ్డా: లోకేష్ – nara lokesh serious comments on cm ys jagan mohan reddy
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డి పాలనలో సీఐడీ (CID) పేరును క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ డిపార్ట్మెంట్ (Crime Involvement Department)గా మార్చేశారని దుయ్యబట్టారు. చివరికి సివిల్ కేసుల సెటిల్మెంట్లు, కబ్జాలకి సీఐడీని అడ్డా చేశారని ఫైరయ్యారు. సీఐడీ పేరు వింటేనే జనం ఛీకొట్టేలా తీరు ఉందని మండిపడ్డారు.
ఈ మేరకు నారా లోకేష్ సోమవారం వరుస ట్వీట్లు చేశారు. ఏ నంబర్ అక్యూజ్డ్ రెడ్డి గారి కళ్లలో ఆనందం కోసం విశాఖ పాత మధురవాడలో కల్లుగీత కార్మికులపై బెదిరింపులకు దిగారో సీఐడీ సమాధానం చెప్పాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. రూ. 20 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేయడానికి సీఐడీని గూండా గ్యాంగుల్లా వాడటం సైకో పాలనలో చూస్తున్నామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పేద గీతకార్మికులపై ఖాకీకావరం చూపుతోన్న సీఐడీకి దమ్ముంటే దసపల్లా భూములు కబ్జా చేసినోళ్లను పట్టుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.