News

nara lokesh, జగన్ రెడ్డి అంటే ఏంటో తెలుసా.. లోకేష్ ఘాటు వ్యాఖ్యలు – tdp leader nara lokesh serious comments against cm ys jagan mohan reddy


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని జగన్ రెడ్డిగా సంబోధించే నారా లోకేష్.. ఆ పేరుకు కొత్త అర్థాలు చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు, వెన్నుపోటుదారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి లోకేష్ వరుస ట్వీట్లు చేశారు.


‘‘తండ్రికి రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వాడిని జగన్ రెడ్డి అంటాం. శివ కుమార్ పెట్టిన పార్టీని కబ్జా చేసిన వాడిని జగన్ రెడ్డి అంటాం. సొంత చెల్లిని గెంటేసిన వాడిని జగన్ రెడ్డి అంటాం. తల్లిని గౌరవించని వాడిని జగన్ రెడ్డి అంటాం.

బాబాయ్ పై గొడ్డలి వేటు వేసిన వాడిని జగన్ రెడ్డి అంటాం. లక్ష కోట్లు మింగి 16 నెలలు చిప్పకూడు తిన్న వాడిని రాక్షసుడు జగన్ రెడ్డి అంటాం. నలుగురు రెడ్లతో కూడిన జగన్ గ్యాంగ్, వీరికి మద్దతుగా వున్న బ్లూ మీడియాని దండుపాళ్యం బ్యాచ్ అంటాం.’’ అని లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Related Articles

Back to top button