News
Nandyal Woman Suicide, అతడికి 52, ఆమెకు 25 ఏళ్లు..ఫేస్‌బుక్ పరిచయం.. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా పారిపోయి.. ఇంతలో ఊహించని ఘటన! – married woman commits suicide in nandyal district
బాపట్ల జిల్లాకు చెందిన 52 ఏళ్ల వ్యక్తికి.. 20 ఏళ్ల కుమారుడు, 18 ఏళ్ల కుమార్తె ఉంది. అతడు భార్యను వదిలేశాడు. ఇటు నంద్యాల జిల్లాకు చెందిన మహిళలకు ఇద్దరు పిల్లలున్నారు. భర్త మద్యానికి బానిస కావడంతో అతనికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ ఇద్దరికి ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. రెండేళ్లుగా ఫోన్లో కూడా మాట్లాడుకుంటున్నారు. చాటింగ్ కూడా చేసేవాళ్లు. ఇటీవల అతడు మహిళను తన వద్దకు వచ్చేయాలని పిలవడంతో ఈ నెల 1న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఏడేళ్ల కుమారుడితో కలిసి వెళ్లిపోయింది.
వెంటనే మహిళ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గాలించి బాపట్ల సమీపంలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను సొంత ఊరికి తీసుకొచ్చారు. పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. 3న రాత్రి ఆమెను తండ్రికి అప్పగించి ఇంటికి పంపించారు. అతడు తిరిగి తన తన సొంత ఊరు బాపట్లకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో శుక్రవారం తహసీల్దార్ సమక్షంలో మహిళను బైండోవర్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఇతంలో ఆమె ఉదయం 6 గంటల సమయంలో తన మేనమామ ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియలేదు. ఇద్దరూ వివాహితులై పిల్లలుండి ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడటం.. ఆ తర్వాత ఇద్దరు కలవడం.. ఇప్పుడు మహిళ ప్రాణం తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. మహిళ ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.