Entertainment

Taraka Ratna: కన్నీళ్లు పెట్టిస్తోన్న తారకరత్న ప్రేమలేఖ.. బాధను దిగమింగి ప్రేమను పంచావంటూఅలేఖ్య ఎమోషనల్


తారకరత్న మరణాన్ని ఆయన సతీమణి అలేఖ్య జీర్ణించుకోలేకపోతోంది. జీవితాంతం కష్ట సుఖాలు పంచుకోవాల్సిన భర్త మధ్యలోనే వదిలివెళ్లడంతో కన్నీరుమున్నీరవుతుందామె.

Taraka Ratna: కన్నీళ్లు పెట్టిస్తోన్న తారకరత్న ప్రేమలేఖ.. బాధను దిగమింగి ప్రేమను పంచావంటూ  అలేఖ్య ఎమోషనల్

Taraka Ratna Wife Alekhya

తారకరత్న మరణాన్ని ఆయన సతీమణి అలేఖ్య జీర్ణించుకోలేకపోతోంది. జీవితాంతం కష్ట సుఖాలు పంచుకోవాల్సిన భర్త మధ్యలోనే వదిలివెళ్లడంతో కన్నీరుమున్నీరవుతుందామె. ఆమెను మామూలు మనిషిని చేయడానికి కుటుంబ సభ్యులు ఎంతో ప్రయత్నిస్తున్నప్పటికీ నిత్యం తారకతర్న జ్ఞాపకాలను తల్చుకుంటూ కుమిలిపోతోంది. ఇటీవలే తారకరత్నతో చివరిసారిగా దిగిన ఫొటో అంటూ ఎమోషనలైంది అలేఖ్యా రెడ్డి. తాజాగా తారకరత్న పెద్దకర్మ సందర్భంగా మరోసారి తీవ్ర భావోద్వేగానికి గురైందామె. వాలంటైన్స్‌డే సందర్భంగా తారకరత్న తనకు రాసిన ప్రేమలేఖను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంది అలేఖ్య. అలాగే తారకరత్నకు ముద్దు పెడుతున్న ఫొటోను కూడా పంచుకుంది. కాగా లెటర్‌లో అలేఖ్యపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిస్తూ తారకరత్న రాసిన మాటలు అందరినీ కదిలిస్తున్నాయి. ‘ఈ ప్రపంచంలో అన్నిటికన్నా నువ్వంటేనా నాకు ఇష్టం. నా కన్నా నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాను. కొన్ని సార్లు నిన్ను బాధ పెట్టి ఉండచ్చు. అయినా అన్నిటినీ భరించి నన్ను ప్రేమించావు. కిష్ట సమయాల్లో నాకు అండగా ఉన్నావు. నా జీవితంలో చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నా లైఫ్‌లో నాకున్న ఒకే ఒక ప్రపంచం నువ్వే బంగారు. హ్యాపీ వాలంటైన్స్‌ డే. లవ్యూ సో మచ్‌ బంగారం’ అంటూ తారకరత్న రాసిన మాటలు అందరినీ కదిలిస్తున్నాయి. ఈ లేఖనే సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన అలేఖ్య..

‘మన జీవితంలో అన్ని  రకాల కష్ట సుఖాలు చూశాం. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. జీవితంలో అత్యంత కష్టకాలం అనుభవించాం. మన కష్టాలు మనకు మాత్రమే తెలుసు. మంచి రోజుల కోసం చాలా ఎదురు చూశాం. మనిద్దరం ఒక చిన్న కుటుంబాన్ని సృష్టించుకున్నాం. నీ జీవితంలో పడిన కష్టాలు ఎవరికీ తెలియదు. నాలా ఎవరూ నిన్ను అర్థం చేసుకోలేదు. నేను నిన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషిస్తున్నా. నీ బాధనంతా నీలోనే దాచి.. మాకు అపారమైన ప్రేమను అందించావు. ప్రపంచం ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని సమస్యలు సృష్టించినా నువ్వు మా చుట్టే ఉన్నావు. నేను మరింత ఎత్తుకు ఎదుగుతా నానా. మేము చాలా మిస్ అవుతున్నాం నానా’ అంటూ ఎమోషనలైంది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. భార్యాభర్తల అన్యోన్య దాంపత్యాన్ని చూసి అందరూ ఎమోషనల్‌ అవుతున్నారు. అలేఖ్యకు దేవుడు మరింత ధైర్యాన్ని ప్రసాదించాలంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఇవాళ (మార్చి 2) హైదరాబాద్​లోని ఫిలింనగర్​ కల్చరల్​ సెంటర్​లో తారకరత్న పెద్దకర్మ నిర్వహించారు. నందమూరి, నారా కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. తారకరత్న చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళి అర్పించారు.



మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement



Related Articles

Back to top button