Entertainment

Nandamuri Kalyan Ram: ఈ నందమూరి హీరోని కోలుకోలేని దెబ్బకొట్టిన సినిమా అదేనట..


నందమూరి ఫ్యామిలీలో హీరోలుగా రాణిస్తున్న వారిలో నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram)ఒకరు. కళ్యాణ్ రామ్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు ఈ యాక్షన్ హీరో.

నందమూరి ఫ్యామిలీలో హీరోలుగా రాణిస్తున్న వారిలో నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram)ఒకరు. కళ్యాణ్ రామ్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు ఈ యాక్షన్ హీరో. పటాస్ సినిమా తర్వాత ఆ స్థాయిలో హిట్ కొట్టడానికి చాలా ప్రయత్నిస్తున్నారు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబిసార సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బింబిసారుడిగా అదరగొట్టనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్లు సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగిన విషయం తెల్సిందే. ఇక  బింబిసార సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా ఓ ఇంట్రవ్యూలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

కళ్యాణ్ రామ్ మొదటి నుంచి ప్రయోగత్మాక సినిమాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓం త్రీడి అనే సినిమా చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆర్ధికంగా దెబ్బతీసిందని.. ఆ సినిమా వల్ల చాలా నష్టపోయానని కళ్యాణ్ రామ్ అన్నారు. ఓం సినిమా దెబ్బకు తన లెక్కలన్నీ తారుమారయ్యాయని.. ఆ నష్టం నుంచి కోలుకోవడానికి రెండేళ్ల తర్వాత వచ్చిన పటాస్ సినిమా రికవరీ చేసిందని.. ఓం సినిమా విషయంలో చాలా ఫీల్ అయ్యానని అన్నారు కళ్యాణ్ రామ్. ఇక బింబిసార సినిమా పై చాలా నమ్మకంతో ఉన్నారు కళ్యాణ్ రామ్. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్. క్యాథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button