Chaitanya Krishna: నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో.. బాలయ్య చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి ఇప్పటికే పలువురు హీరోలుగా వచ్చారు. ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ, హరికృష్ణ హీరోలుగా రాణించి తండ్రికి తగ్గ తనయులు అనిపించుకున్నారు.

Nandamuri Chaitanya Krishna
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి ఇప్పటికే పలువురు హీరోలుగా వచ్చారు. ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ, హరికృష్ణ హీరోలుగా రాణించి తండ్రికి తగ్గ తనయులు అనిపించుకున్నారు. ఆతర్వాతి తరంలో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, దివంగత తారకరత్న హీరోలుగా వెలుగొందారు. ఇప్పుడీ జాబితాలో మరొకరు చేరనున్నాడు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ హీరోగా వెండితెరకు పరిచయం కానున్నాడు. బసవతారకరామ క్రియేషన్స్ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను నెలకొల్పిన ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. గతంలో రక్ష, జక్కన్న వంటి సినిమాలను తెరకెక్కించిన వంశీకృష్ణ ఆకెళ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు మార్చి 5న టైటిల్‌ను ప్రకటిస్తామని మూవీ యూనిట్ తెలిపింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది.
20 ఏళ్ల తర్వాత..
కాగా 2003లో తెలుగులో రిలీజైన ధమ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీకి ఇచ్చాడు నందమూరి చైతన్య కృష్ణ. జగపతి బాబు, సోనియా అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో చైతన్య కృష్ణ ఓ కీ రోల్ పోషించాడు. అయితే ఆ తర్వాత వ్యాపారంలో బిజీ అయిపోయారు. సుమారు 20 ఏళ్ల తర్వాత హీరోగా పరిచయం కానున్నాడు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకుని గతేడాది మేలోనే ఈ సినిమాను ప్రకటించారు చైతన్యకృష్ణ. అయితే ఎందుకో కానీ ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా టైటిల్ అప్డేట్‌ను ప్రకటించారు.
Production No.1 from @BTRCreations 💥
AdvertisementBrace Yourselves for the Title Launch on March 5th 🤩
🌟ing #NandamuriChaitanyaKrishna 🤩
A film by @VKrishnaakella 🎬
𝙀𝙫𝙚𝙧𝙮 𝙨𝙞𝙣𝙣𝙚𝙧 𝙣𝙚𝙚𝙙𝙨 𝙩𝙧𝙚𝙖𝙩𝙢𝙚𝙣𝙩 pic.twitter.com/1IvnIv8Djk
— Basavatarakarama Creations (@BTRcreations) March 3, 2023
A Glimpse of NATASIMHAM 🦁 #NandamuriBalaKrishna launching @BTRcreations PRODUCTION NO.1 🤩💥
🌟ing #NandamuriChaitanyaKrishna 🤟
A film by @VKrishnaakella 🎦
Exciting Updates Coming Soon 🤗 pic.twitter.com/4ofcfpJeMC
— Shreyas Sriniwaas (@shreyasmedia) May 28, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి