nandamuri balakrishna, Veera Simha Reddy సెన్సార్ బోర్డు నుంచి గ్రీన్‌సిగ్నల్.. కానీ రన్‌టైమ్‌పై నో క్లారిటీ! – nandamuri balakrishna’s veera simha reddy clears its censor formalities
వీరసింహా రెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్‌కాబోతోంది. ఈ మేరకు రెండు రోజుల క్రితం ఒంగోలులో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని చిత్ర బృందం నిర్వహించింది. అక్కడే మూవీ ట్రైలర్‌ని కూడా రిలీజ్ చేశారు. మాస్ ఆడియెన్స్‌ని కట్టిపడేసేలా ఉన్న ఈ ట్రైలర్లో నందమూరి బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగ్‌లతో చెలరేగిపోయారు. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో ఏపీలో ప్రస్తుత రాజకీయాల్ని కూడా పరోక్షంగా ప్రస్తావిస్తూ బాలకృష్ణ డైలాగ్‌లు పేల్చారు. దాంతో ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు పతాక స్థాయికి చేరిపోయాయి.
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన వీరసింహా రెడ్డి మూవీ సెన్సార్ పనులు మొత్తం ఈరోజు పూర్తయినట్లు ప్రకటించిన చిత్ర యూనిట్.. సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చినట్లు వెల్లడించింది. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్.. అది కూడా బాలకృష్ణ గొడ్డలి, సుత్తి, కత్తితో రౌడీలను ఎగరేసి నరుకుతున్నట్లు ట్రైలర్లో చూపించారు. దాంతో మూవీలో రక్తపాతం ఉండటంతో సెన్సార్ బోర్డు ‘ఎ’ సర్టిఫికెట్ ఇస్తుందని అంతా ఊహించారు. అయితే.. మూవీని మొత్తం చూసిన బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది.
కానీ.. వీరసింహా రెడ్డి మూవీ రన్ టైమ్‌పై మాత్రం ఇంక్లా క్లారిటీ రావడం లేదు. ఫైనల్ కట్ నిడివి 197 నిమిషాలు అనే విషయం గత వారం వెలుగులోకి వచ్చింది. అయితే.. సెన్సార్ వర్క్‌కి ముందే కనీసం ఓ 35-40 నిమిషాలు కట్ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. దాంతో 155-160 రన్ టైమ్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ రన్‌టైమ్ 160 నిమిషాలు. ఈ మూవీని కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా.. జనవరి 13న థియేటర్లలోకి రాబోతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే రెండు మూవీల్లోనూ హీరోయిన్ శృతి హాసనే.
Read Latest Telugu Movies News , Telugu News