nandamuri balakrishna, Veera Simha Reddy: కసి తీరలేదు.. ఆ సినిమా చేస్తా.. ‘వీరసింహా రెడ్డి’ ప్రీరిలీజ్ ఈవెంట్లో బాలయ్య – nandamuri balakrishna powerful speech at veera simha reddy pre release event
ప్రీరిలీజ్ ఈవెంట్లో బాలయ్య మాట్లాడుతూ ‘చెంఘీజ్ ఖాన్ సినిమా చేయాలనేది నా జీవిత ఆశయం. ఇద్దరు క్రాక్‌లు కలిస్తే ఎలా ఉంటుందో? గోపీచంద్ మలినేని, నేను కలిస్తే అలా ఉంటుంది. ఒంగోలు గిత్త ఈ గోపీచంద్ మలినేని. ఎన్ని సినిమాలు చేసినా.. నాకు ఇంకా కసి తీరలేదు. బాలయ్య ఇక రాడులే.. రాజకీయాలకే పరిమితంలే అనుకున్నారు. కానీ కొత్తగా ట్రై చేస్తున్నా. ఈ క్రమంలో చేసిన ఆహా అన్‌స్టాబబుల్ ఇప్పుడు టాక్ షోలకే అమ్మ మొగుడై కూర్చుంది. ఏదో కొత్తదనం ఇవ్వాలనే తాపత్రయంలో చేసిందే ఆ షో. ఈ మూవీలో ఫ్యాక్షన్ ఇప్పుడు ఎందుకు అంటున్నారు. కానీ దాని వెనుక ఒక బలమైన కథ ఉంది. హీరోయిన్ శృతి హాసన్, విలన్‌గా నటించిన దునియా విజయ్ చాలా బాగా నటించారు’ అని బాలయ్య చెప్పుకొచ్చారు.
వేదికగాపై సప్తగిరి గురించి మాట్లాడిన బాలయ్య ‘సప్తగిరికి ఉన్నంత కామెడీ టైమింగ్ నాకు లేదు. ఎన్ని సినిమాలు చేసినా అతని కామెడీ టైమింగ్ చూసి నేర్చుకోవాలని అనుకుంటున్నా. అతనిని చూస్తే నాకు ఈర్ష’ అని చెప్పుకొచ్చారు. చివరిగా ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికని సడన్‌గా మార్చడంపై కూడా బాలయ్య స్పందించారు. వాస్తవానికి తొలుత ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ఏబీఎం కాలేజీ గ్రౌండ్లో నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ.. పోలీసుల సూచనల మేరకు మార్కెట్ యార్డ్‌కి ఎదురుగా ఉన్న అర్జున్ ఇన్ప్రా గ్రౌండ్లో నిర్వహించారు. ‘ఆ వేదిక సరిపోదని.. చాలా మంది అభిమానులు వస్తున్నారని సమాచారం రావడంతో ఇక్కడికి వేదికని మార్చారు’ అని సున్నితంగా చెప్పుకొచ్చారు.
ఈ మూవీలో సెకండ్ హీరోయిన్గా చేసిన హనీ రోస్ గురించి బాలయ్య ప్రత్యేకంగా మాట్లాడారు. వేదికపై ఈ మలయాళీ భామ పక్కగా ఉండటంతో.. ముందుకు రమ్మని మలయాళంలో పిలిచిన బాలయ్య.. మూవీ రిలీజ్ అయ్యే వరకూ ఈమె పాత్రని గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. మూవీ ఆమె క్యారెక్టర్ గురించి రిలీజ్ తర్వాత మీరే మాట్లాడుకుంటారని చెప్పుకొచ్చారు.
Read Latest Telugu Movies News , Telugu News