nandamuri balakrishna, Unstoppable లో వీరసింహా రెడ్డి టీమ్ సందడి.. హీరోయిన్ని స్ట్రైట్‌గా అడిగేసిన బాలయ్య – unstoppable 2 with veerasimha reddy team promo release
వరలక్ష్మి శరత్ కుమార్‌తో కలిసి డైరెక్టర్ గోపీచంద్ ఫస్ట్ వచ్చారు. దాంతో.. వారిద్దరితో కాసేపు మాట్లాడిన బాలయ్య కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నల్ని డైరెక్టర్‌కి సంధించారు. బాలకృష్ణ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ విలన్‌గా ఉందా? లేదంటే వరలక్ష్మి శరత్ కుమార్ విలన్‌గా ఉన్న సినిమాలో బాలకృష్ణ హీరోనా? అని అడిగారు. దానికి గోపీచంద్ మలినేని నవ్వేశాడు. గోపీచంద్ గత చిత్రం క్రాక్‌లోనూ వరలక్ష్మి శరత్ కుమార్ నెగటివ్ రోల్ పోషించడంతోనే బాలయ్య ఈ ప్రశ్న అడిగినట్లు తెలుస్తోంది.
బాలయ్య గురించి వరలక్ష్మి మాట్లాడుతూ.. ‘నేను అనుకున్నాను నేనే హైపర్ అని.. కానీ మీరు నాకంటే ఎక్కువ హైపర్’ అంటూ ప్రశంసించింది. దాంతో బాలయ్య హుషారుగా సీట్లో కూర్చుని డ్యాన్స్ వేస్తూ కనిపించారు. ఆ తర్వాత వరలక్ష్మితో సరదాగా బాలయ్య గేమ్ ఆడారు. వీరసింహా రెడ్డి ఇంటర్వెల్ బ్లాక్ గురించి గోపీచంద్ మాట్లాడుతూ దాన్ని మీరు ఓకే చేయడంతోనే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అని చెప్పుకురాగా.. అందుకేగా డబుల్ రోల్ పెట్టి బాగా వాడేసుకున్నావ్? అని బాలయ్య సెటైర్ వేశారు. అదే క్రమంలో సినిమాని కుమ్మేశావ్… నన్ను కూడా నానా కుమ్ముడు కుమ్మేశావ్ అని బాలయ్య అంటుండగా.. విలన్ దునియా విజయ్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. రావడంతోనే వీరసింహా రెడ్డి భయమా? అంటూ దునియా విజయ్ వార్నింగ్ డైలాగ్‌తో చెలరేగిపోయాడు.
కాసేపటికే సెకండ్ హీరోయిన్ హనీ రోస్ కూడా వేదికపైకి వచ్చింది. దాంతో ఆమెని స్ట్రైట్‌గా బాలయ్య ఒక ప్రశ్న అడిగేశారు. ‘బాలకృష్ణతో సినిమా అని చెప్పారు.. అప్పుడు నువ్వు బాలకృష్ణ ఎలాంటి వ్యక్తి? అని ఎవరినైనా అడిగి కనుకున్నావా?’ అని హనీ రోస్ని అడిగారు. దాంతో తాను అఖండ మూవీని చాలా సార్లు చూశానని.. నేను ఊహించినట్లు మీరు లేరని చెప్పుకొచ్చింది.
Read Latest Telugu Movies News , Telugu News