Entertainment

Tarakaratna: తారకరత్న కోసం బాలయ్య మరో అడుగు.. మృత్యుంజయ ఆలయంలో 44 రోజుల పాటు అఖండ దీపారాధన


నందమూరి తారకరత్న ఆరోగ్యం మెరుగవ్వాలంటూ బాలకృష్ణ చేపట్టిన అఖండ దీపారాధన ఇప్పుడందరి నోళ్లలో నానుతుంది. బాబాయ్ సంకల్పం అబ్బాయ్‌ని క్షేమంగా ఇంటికి చేరుస్తుందని బలంగా నమ్ముతున్నారు.

Tarakaratna: తారకరత్న కోసం బాలయ్య మరో అడుగు.. మృత్యుంజయ ఆలయంలో 44 రోజుల పాటు అఖండ దీపారాధన

Balakrishna, Taraka Ratna

నందమూరి తారకరత్న ఆరోగ్యం మెరుగవ్వాలంటూ బాలకృష్ణ చేపట్టిన అఖండ దీపారాధన ఇప్పుడందరి నోళ్లలో నానుతుంది. బాబాయ్ సంకల్పం అబ్బాయ్‌ని క్షేమంగా ఇంటికి చేరుస్తుందని బలంగా నమ్ముతున్నారు. సాధారణంగా ఇళ్లల్లో, దేవాలయాల్లో పూజ చేయాలంటే ముందుగా దీపారాధనతోనే పూజను ప్రారంభిస్తాం. ఇది గత కొన్ని సంవత్సరాలుగా హిందూ ఆచార వ్యవహారాలలో భాగంగా వస్తున్న ఆనవాయితీ. అయితే సంపద, ఆరోగ్యం, ఊహించని ప్రమాదాలకు సంబంధించిన అడ్డంకులు తొలగించడం లాంటి సమస్యలకు దీపారాధన చేస్తుంటారు. ఇందులో భాగంగానే తారకరత్న ఆరోగ్యం మెరుగవ్వాలంటూ అఖండ దీపానికి శ్రీకారం చుట్టారు బాలకృష్ణ. నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తారకరత్న ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరాతీస్తూనే ఉన్నారు బాలకృష్ణ. మరోవైపు అఖండ దీపం బాధ్యతలు తన పీఎ రవికి అప్పగించారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బత్తలాపురంలో మృత్యుంజయస్వామి ఆలయంలో అఖండ జ్యోతి వెలుగుతోంది. ఈ బాధ్యతలు కఠోర దీక్షతో నియమబద్ధంగా కొనసాగుతున్నాయి.

అఖండ అంటే ఖండం లేనటువంటింది. దీపాలను ప్రమిదల్లో పెట్టరు.. కేవలం మట్టి, కంచు పాత్రల్లో మాత్రమే వెలిగిస్తారు. అది కూడా రోజుల తరబడి నీళ్లల్లో నానబెట్టి నువ్వుల నూనె పోసి అలంకరణ చేసి వెలిగిస్తారు. ఇలా చేస్తే ఆయురారోగ్యాలు మెరుగవుతాయని నమ్మకం. అంతేకాదూ.. ఈ దీప సంకల్పమే తారకరత్నను గండం నుంచి గట్టెక్కిస్తుందని నందమూరి కుటుంబంతో పాటు అభిమానులు విశ్వసిస్తున్నారు. మృత్యుంజయస్వామి ఆలయంలో అఖండ జ్యోతి దాదాపు 44 రోజుల పాటు కొనసాగనుంది. నిజానికి తారకరత్న ఆరోగ్యం రోజురోజుకి మెరుగవుతుంది. కాళ్లు, చేతులు కదుపుతున్నారు. ట్రీట్‌మెంట్‌కి సహకరిస్తున్నారు. గుండె బాగానే పనిచేస్తున్నా.. బ్రెయిన్‌లో సమస్యలు ఉన్నట్టు వైద్య బృందం గుర్తించింది. అయితే బ్రెయిన్‌లో స్వెల్లింగ్‌ తగ్గితే.. ట్రీట్‌మెంట్‌ ప్రారంభించే అవకాశాలున్నాయి. బాబాయ్‌ బాలకృష్ణ ప్రయత్నాలు ఫలించాలి.. అభిమానుల ప్రార్థనలు సక్సెస్‌ కావాలి.. తారకరత్న ఆరోగ్యంగా మన ముందుకు రావాలి. ఇప్పుడందరి మనసులో ఉన్నది ఒకటే.. గెట్‌ వెల్‌ సూన్‌ తారకరత్న.

ఇవి కూడా చదవండి

Mrityunjaya Temple

Mrityunjaya Temple

Advertisement

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button