News

nagarjuna next movie, న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టంలో నాగార్జున త‌ర్వాతే ఎవ‌రైనా.. మ‌లయాళ రీమేక్‌కి గ్రీన్ సిగ్న‌ల్‌! – writer prasanna kumar turns director for nagarjuna malayalam remake


టాలీవుడ్ సీనియ‌ర్ క‌థానాయ‌కుడు నాగార్జున అక్కినేని (Nagarjuna Akkineni) గురించి సినీ ప్రేక్ష‌కుల‌కు కొత్త‌గా ప‌రిచ‌య‌మేమీ అక్క‌ర్లేదు. ఓ ఇమేజ్ చ‌ట్రంలో ఇరుక్కుపోకుండా సినిమాలు చేయ‌టానికి ఆయ‌న ఎప్పుడూ ఆస‌క్తి చూపిస్తుంటారు. ప్ర‌యోగాత్మ‌క సినిమాలు చేయ‌టానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. చాలా మంది కొత్త ద‌ర్శ‌కులు, ఇత‌ర యంగ్ టెక్నీషియ‌న్స్‌ని చాలా మందిని ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త నాగార్జున సొంతం. న్యూ టాలెంట్‌ను గుర్తించి వారిని ఎంకరేజ్ చేయటం.. కొత్త వారితో సరి కొత్త హిట్ సినిమాలు చేయటం సీనియర్ అగ్ర హీరోల్లో నాగార్జునకే చెల్లుతుందనే టాక్ కూడా బలంగానే వినిపిస్తుంటుంది. అలాంటి సీనియ‌ర్ స్టార్ ఇప్పుడు మ‌రో కొత్త ద‌ర్శ‌కుడిని టాలీవుడ్‌కి (Tollywood) ప‌రిచ‌యం చేయ‌బోతున్నారంటూ సినీ స‌ర్కిల్స్‌లో బ‌ల‌మైన వార్త‌లు వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళితే..

నాగార్జున త‌న గ‌త చిత్రం ‘ది ఘోస్ట్’ (The Ghost)పై చాలా న‌మ్మ‌కాలే పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు. దీంతో నాగ్ కాస్త గ్యాప్ తీసుకున్నారు. కొత్త క‌థ‌లు విన్నారు. రీసెంట్‌గా ఓ క‌థ ఆయ‌న‌కు తెగ న‌చ్చేసింది. ఆ క‌థ‌ను రాసింది ఎవ‌రో కాదు.. సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్‌ (Nneu Local), ధ‌మాకా చిత్రాల రైట‌ర్ బెజ‌వాడ ప్ర‌స‌న్న‌కుమార్. మ‌రి సినిమాను ఎవ‌రు డైరెక్ట్ చేస్తార‌నే విష‌యంపై నాగార్జున బాగానే ఆలోచించారు. చివ‌ర‌కు మ‌న‌సులో ఎలాంటి లెక్క‌లు వేసుకున్నారో తెలియ‌దు కానీ.. రైట‌ర్ ప్ర‌స‌న్న‌కుమార్‌నే (Prasanna Kumar) త‌న సినిమాకు ద‌ర్శ‌కుడిగా చేయాల‌ని నిర్ణ‌యించేసుకున్నారు.

అస‌లే చాలా కాలంగా దర్శ‌క‌త్వం వ‌హించాల‌ని వెయిట్ చేస్తున్న ప్ర‌స‌న్న‌కుమార్‌.. నాగార్జున లాంటి హీరోని డైరెక్ట్ చేసే అవ‌కాశం వ‌స్తే వ‌దులుకుంటాడా! వెంట‌నే ఓకే చెప్పేశాడు. ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేంటో తెలుసా!.. నాగార్జున చేయ‌బోతున్న సినిమా ఓ మ‌లయాళ రీమేక్‌. 2019లో విడుద‌లై మంచి విజ‌యం సాధించిన పొరింజు మ‌రియం జోస్‌ను (Porinju Mariam Jose) ప్ర‌స‌న్న‌కుమార్ తెలుగు నెటివిటీకి త‌గ్గ‌ట్టు చాలా మార్పులు చేర్పులు చేసి వినిపిస్తే ఆయ‌న‌కు తెగ న‌చ్చేసింది. రామ్‌తో ది వారియ‌ర్‌.. ఇప్పుడు రామ్ – బోయ‌పాటి సినిమాల‌తో పాటు నాగ చైత‌న్య‌తో క‌స్ట‌డీ సినిమాను నిర్మిస్తోన్న ప్రొడ్యూస‌ర్ శ్రీనివాస చిట్టూరి నాగార్జున నెక్ట్స్ మూవీని నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌లకానుంది.

ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ సీజన్ 6కు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. దీని తర్వాతే నాగ్ కొత్త ప్రాజెక్టుని సెట్స్ పైకి తీసుకెళ్లాలని యోచిస్తున్నారట.

Related Articles

Back to top button