Entertainment

Nagarjuna : బాయ్‌కాట్ ట్రెండ్ పై నాగార్జున ఇంట్రస్టింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే


ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు బాయ్ కాట్. సినిమా ఏదైనా బాలీవుడ్ నుంచి ఇదే మాట ముందు వినిపిస్తోంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా అని సినిమాలకు ఈమధ్య బాయ్ కాట్ సెగ తగిలింది.

ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు బాయ్ కాట్. సినిమా ఏదైనా బాలీవుడ్ నుంచి ఇదే మాట ముందు వినిపిస్తోంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా అని సినిమాలకు ఈమధ్య బాయ్ కాట్ సెగ తగిలింది. ముఖ్యంగా అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమాకు ఇది మైనస్ అయ్యింది. సినిమా పై నెగిటివిటీని పెంచేసింది. తాజాగా విడుదలైన బ్రహ్మాస్త సినిమా  కూడా ఇదే ట్యాగ్ ఇచ్చారు కొందరు. కానీ వాటన్నింటిని దాటుకొని సూపర్ హిట్ గా నిలిచింది బ్రహ్మాస్త్ర. రణబీర్ కపూర్, అలియా భట్ కలిసి నటించిన ఈ సినిమాలో అమితాబ్, నాగార్జున(Nagarjuna )కీలక పాత్రలో నటించారు. తాజాగా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. నెగిటివ్ రివ్యూలు, బాయ్ కాట్ పై స్పందించారు.

నాగ్ మాట్లాడుతూ.. బాయ్ కాట్ అనేది ఇండస్ట్రీపై అంతగా ప్రభావం చూపిస్తోందని నేను అనుకోవడం లేదు అన్నారు నాగ్.  బాగున్న సినిమాలను ఏ నెగిటివ్ ప్రచారం కూడా ఆపలేదని ఆయన అన్నారు. బాలీవుడ్ లో ‘లాల్ సింగ్ చడ్డా’ ఆడలేదు.. కానీ ‘బ్రహ్మాస్త్రం’ బాగా ఆడింది. ‘లాల్ సింగ్ చద్దా’ హిట్ అవ్వలేదంటే అది బాయ్ కాట్ ట్రెండ్ వల్ల మాత్రం కాదు. ఈ సినిమా కంటే ముందు వచ్చిన ‘గంగూబాయి కతియావాడి’ ‘భూల్ భులయ్యా 2’ ‘జుగ్ జుగ్ జీయో’ సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. అవి మంచి విజయాలు సాధించాయి. ఇక ‘కార్తికేయ 2’ ‘RRR’ ‘కేజీఎఫ్ 2’ ‘పుష్ప’ లాంటి మన సౌత్ చిత్రాలు హిందీలో బాగా ఆడాయి. సినిమా బాగుంటే ఆడుతుంది” అని నాగార్జున చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button