Entertainment

Naga Shaurya: తనకు కాబోయే భార్య గురించి చెప్పేసిన నాగశౌర్య.. తెలుగమ్మాయే అంటూ..


అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా రేపు (సెప్టెంబర్ 23న) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న శౌర్య.. తన పెళ్లిపై స్పందించాడు.

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) ప్రస్తుతం నటిస్తోన్న సినిమా కృష్ణ వ్రింద విహారి. డైరెక్టర్ అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో షిర్లీ సెటియా కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీతో ఆమె టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. అలాగే ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించిన ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా రేపు (సెప్టెంబర్ 23న) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న శౌర్య.. తన పెళ్లిపై స్పందించాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గో్న్న శౌర్యను పెళ్ళేప్పుడు అని యాంకర్ అడగ్గా.. చెప్తాను అని అనడంతో త్వరలోనే అవుతుందా ? అని మళ్లీ అడగ్గా.. నవ్వేశారు. డేటింగ్‍లో ఉన్నారా ? తెలుగమ్మాయా ? అని అడగ్గా.. లే అంటూ నవ్వేసారు. దీంతో పెళ్లి.. తనకు కాభోయే భార్య తెలుగమ్మాయే అనే విషయంపై హింట్ ఇచ్చేశాడు ఈ కుర్రహీరో. దీంతో త్వరలోనే నాగశౌర్య పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ విషయంపై అసలు క్లారిటీ రావాలంటే ఇంకా కొద్దిరోజులు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి



మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement



Related Articles

Back to top button