Naga Shaurya: అతి చేసిన ప్రేమికుడు.. రోడ్డు పై గొడవపడిన హీరో నాగశౌర్య
రోడ్డు పై కారు ఆపి ఒక యువకుడితో వాగ్వాదానికి దిగాడు నాగ శౌర్య. అయితే అసలు విషయం ఏంటంటే. రోడ్డు పై ఇద్దరు లవర్స్ గొడవపడుతున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే పెళ్లి పీటలు కూడా ఎక్కాడు ఈ యంగ్ హీరో. సినిమాలతో బిజీగా ఉన్న శౌర్య తాజాగా రోడ్డు పై గొడవ పడుతూ కనిపించాడు నాగ శౌర్య. రోడ్డు పై కారు ఆపి ఒక యువకుడితో వాగ్వాదానికి దిగాడు నాగ శౌర్య. అయితే అసలు విషయం ఏంటంటే. రోడ్డు పై ఇద్దరు లవర్స్ గొడవపడుతున్నారు. ఇంతలో ఆ యువకుడు ఆ అమ్మాయి పై చేయి చేసుకున్నాడు. అటుగా వెళ్తోన్న నాగశౌర్య అది చూశాడు. వెంటనే కారు ఆపి దిగి వచ్చి ఆయువకుడిని నిలదీశాడు.
రోడ్డు పై అమ్మాయి మీద చేయి చేసుకుంటావా.. ఆ అమ్మాయికి సారి చెప్పు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అయినా కూడా ఆ యువకుడు ఆమె నా లవర్ నా ఇష్టం అంటూ దురుసుగా ప్రవర్తించాడు. దాంతో కోపంతో ఊగిపోయిన శౌర్య ఆ అమ్మాయి నీ లవర్ అయితే మాత్రం రోడ్డు మీద అమ్మాయిని కొడతావా అంటూ ఆ యువకుడిని నిలదీశాడు. శౌర్య చేసిన పనికి అందరు ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.