Entertainment

Naga Chaitanya: సామ్‌తో విడాకులపై చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. మా మధ్య ఏం జరిగిందో ఎప్పటికీ సీక్రెటే అంటూ..


Naga Chaitanya: నాగచైతన్య, సమంతల మధ్య విడాకుల వ్యవహారం జరిగి దాదాపు ఏడాది దగ్గరపడుతోన్నా ఇప్పటికీ ఆ అంశంపై ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. ఎన్నో ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట..

Naga Chaitanya: నాగచైతన్య, సమంతల మధ్య విడాకుల వ్యవహారం జరిగి దాదాపు ఏడాది దగ్గరపడుతోన్నా ఇప్పటికీ ఆ అంశంపై ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. ఎన్నో ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట అనూహ్యంగా విడిపోతున్నామంటూ ప్రకటించడం అటు అభిమానులను ఇటు ఇండస్ట్రీని షాక్‌కి గురి చేసింది. అయితే విడాకుల గల కారణాన్ని ఈ జంట ఎప్పుడూ బయట పెట్టలేదు. కొన్ని సందర్భాల్లో సమంత తమ విడాకుల విషయంపై స్పందించిన విషయం తెలిసిందే. మొన్నటి మొన్న కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొన్న సామ్‌.. తమ విడాకుల వ్యవహారం అంత సులువుగా జరగలేదని, తమ మధ్య ఎన్నో మనస్పార్థాలు వచ్చినట్లు సమంత చేసిన కామెంట్స్‌ అందరినీ షాక్‌కి గురి చేశాయి.

అయితే నాగ చైతన్య మాత్రం విడాకుల విషయమై ఎప్పుడూ స్పందించకుండా వీలైనంత దూరంగా ఉంటూ వచ్చాడు. అయితే తాజాగా చై కూడా ఓపెన్‌ అయ్యాడు. విడాకులకు సంబంధించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెరీర్‌లో తాను సాధించిన విజయాలకంటే తన వ్యక్తిగత జీవితం ఎక్కువగా హెడ్‌లైన్స్‌లో నిలవడం చూస్తుంటే చిరాకుగా ఉందని వాపోయాడు. ఇక తాము విడిపోయినప్పుడు కూడా ఇద్దరం ఏమైతే చెప్పాలనుకున్నారో అదే విషయాన్ని ట్వీట్‌ చేశామని, అంతకు మించి తమ మధ్య జరిగిన మధ్య జరిగిన ఒక్క విషయాన్ని నేను ఈ ప్రపంచానికి తెలియజేయాలనుకోవడం లేదని చైతన్య తేల్చి చెప్పాడు.

ఈ విషయమై ఇంకా మాట్లాడుతూ.. ‘మా జీవితాల్లో ఏం జరిగిందే నా కుంటుంబం, బంధుమిత్రులందరికీ తెలుసు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో జరుగుతోన్న ప్రచారాలు, ఉహాగానాలన్నీ తాత్కాలికమైనవి. వాటిపై నేను ఎంతగా స్పందిస్తే అన్ని వార్తలు పుట్టుకొస్తాయి. అది నాకిష్టం లేదు. అందుకే వాటిని పట్టించుకోవడం లేదు. ఏదో ఒక రోజు ఈ ప్రచారాలన్నింటికీ ముగింపు ఉంటుందనే నమ్మకం నాకుంది’ అంటూ చెప్పుకొచ్చాడు చైతన్య.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button