nadendla manohar, సమాజంలో కుల వివక్ష, అసమానతలు ఎన్నో ఏళ్లుగా ఉన్నాయి: నాదెండ్ల మనోహర్ – janasena leader nadendla manohar comments on sc st sup plan
సమాజంలో కుల వివక్ష, అసమానతలు ఎన్నో దశాబ్దాలుగా ఉంటూనే ఉన్నాయని నాదెండ్ల మనోహర్ అన్నారు. రాజకీయ వ్యవస్థలో ఎవరైనా అభిప్రాయాలు వెలిబుచ్చే అవకాశం ఇవ్వకపోతే ఎలాగని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పూర్తిగా అమలు చేసి, నిధులిస్తే వాటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయని వివరించారు. అందరికీ వీటిపై అవగాహన కల్పించి, అభిప్రాయాలు పంచుకోవాలనే ఈ సదస్సు ఏర్పాటు చేశామన్నారు. అన్ని పట్టణాలు, పల్లెల్లో తిరిగి వారి హక్కుల గురించి వివరించాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు జగన్ ప్రభుత్వం 60 శాతం కూడా నిధులు ఇవ్వకుండా దారి మళ్లించారని నాదెండ్ల మనోహర్ ఫైరయ్యారు. బడుగు, బలహీన వర్గాలకు సమాన హక్కులు, అధికారాలు కల్పించాలన్నారు. ప్రతి ఏడాది నిధుల వినియోగంపై చర్చ జరగాలని, ఆడిట్ చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచులకు ఇచ్చే నిధులు కూడా లాగేశారని పేర్కొన్నారు. నేడు ఒక వీధి లైటు పోయినా వేయలేని దుస్థితిలో సర్పంచులు ఉన్నారన్నారు.