Nabha Natesh: యాక్సిడెంట్లో గాయపడ్డ ‘ఇస్మార్ట్’ హీరోయిన్.. సర్జరీలతో మానసిక వేదన అనుభవించానంటూ ఎమోషనల్
2021 సెప్టెంబర్‌లో విడుదలైన మ్యాస్ట్రో తర్వాత మరే సినిమాలోనూ నభా కనిపించలేదు. కొత్త ప్రాజెక్టు అప్డేట్స్ కూడా ఇవ్వలేదు. సోషల్ మీడియాలోనూ ఎలాంటి పోస్టులు కనిపించలేదు. దీంతో ఈ అమ్మడికి ఏమైందా? అని అభిమానులు డైలమాలో పడ్డారు.
‘నన్ను దోచుకుందువటే’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నభా నటేష్. మొదటి చిత్రంతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆతర్వాత అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా చేరువైంది. ముఖ్యంగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో కలిసి నటించిన ఇస్మార్ట్ శంకర్‌లో నభా అందచందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. సాయి ధరమ్ తేజ్, నితిన్ లాంటి యంగ్ హీరోలతో స్ర్కీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. 2021 సెప్టెంబర్‌లో విడుదలైన మ్యాస్ట్రో తర్వాత మరే సినిమాలోనూ నభా కనిపించలేదు. కొత్త ప్రాజెక్టు అప్డేట్స్ కూడా ఇవ్వలేదు. సోషల్ మీడియాలోనూ ఎలాంటి పోస్టులు కనిపించలేదు. దీంతో ఈ అమ్మడికి ఏమైందా? అని అభిమానులు డైలమాలో పడ్డారు. తాజాగా ఈ విషయంపై స్పందించింది నభా నటేష్. ఇలా తాను బ్రేక్ తీసుకోవడానికి గల కారణాలను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంది.
‘నేను గతేడాది సినిమాలు చేయలేదు. నాలాగే మీకు కూడా మిస్సయిన ఫీలింగ్ ఉంటుందని నాకు తెలుసు. 2022లో నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది. నా ఎడమ భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చాలా సర్జరీలు చేయాల్సి వచ్చింది. ఇవి నన్ను మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ఎంతో ఇష్టపడే సినిమాల్లో నటించాలని అనుకుంటున్నాను. మీ ప్రేమ, అభిమానం వల్లే నేను అనుకున్నదానికంటే త్వరగా రికవరీ అవుతున్నాను. నా ఆరోగ్యం ప్రస్తుతం బాగుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 2023.. నేను రెడీ. మునుపటి కంటే ఉత్సాహంగా ఉన్నాను ’ అని ఆ పోస్ట్‌లో తెలిపింది నభా. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి