News

Naatu Naatu Song: ఆస్కార్ బరిలో నిలిచిన నాటు నాటు సాంగ్.. అవార్డుకు కూతవేటు దూరంలో.. | Naatu naatu song nominated in the best Original Song category in Oscar 2023 telugu cinema news


Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Jan 24, 2023 | 7:31 PM

95వ అస్కార్ అవార్డ్ నామినేషన్స్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్ నిలిచింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పాట నామినేట్ అయ్యింది.

Naatu Naatu Song: ఆస్కార్ బరిలో నిలిచిన నాటు నాటు సాంగ్.. అవార్డుకు కూతవేటు దూరంలో..

Naatu Naatu Song

95వ అస్కార్ అవార్డ్ నామినేషన్స్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్ నిలిచింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పాట నామినేట్ అయ్యింది. మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ఆస్కార్ నామినేషన్స్‏లో నాటు నాటు సాంగ్ ఎంపికైంది. ఇప్పటికే నాటు నాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు లభించింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే ఎన్నో అవార్డులను అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ బరిలో నిలిచింది. పలు భాషల నుంచి దాదాపు 300 చిత్రాలు షార్ట్ లిస్ట్ కాగా.. అత్యత్తమ ప్రమాణాలను కలిగిన చిత్రాలను ఓటింగ్ ద్వారా ఆస్కార్ మెంబర్స్ తుది జాబితాకు ఎంపిక చేశారు. కాలిఫోర్నియా వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button