Entertainment

Nivriti Vibes: నివృతి వైబ్స్‌ నుంచి మరో ఫోక్‌ సాంగ్‌.. బీమ్స్ మ్యూజిక్‌కి ఫిదా అవుతోన్న నెటిజన్లు.


నివృతి వైబ్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌ నుంచి వస్తున్న పాటలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. ముఖ్యంగా జానపద పాటలకు నివృతి వైబ్స్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అత్యుత్తమ‌మైన ప్రొడ‌క్షన్ విలువలతో ఆడియో, విజువ‌ల్ కంటెంట్‌ను అందించ‌టంలో ఎప్పటిక‌ప్పుడు త‌న‌కు తానే బెస్ట్ అనిపించుకుంటూ ఈ సంస్థ…

Nivriti Vibes: నివృతి వైబ్స్‌ నుంచి మరో ఫోక్‌ సాంగ్‌.. బీమ్స్ మ్యూజిక్‌కి ఫిదా అవుతోన్న నెటిజన్లు.

Naa Friendhemo Pelli Song

నివృతి వైబ్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌ నుంచి వస్తున్న పాటలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. ముఖ్యంగా జానపద పాటలకు నివృతి వైబ్స్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అత్యుత్తమ‌మైన ప్రొడ‌క్షన్ విలువలతో ఆడియో, విజువ‌ల్ కంటెంట్‌ను అందించ‌టంలో ఎప్పటిక‌ప్పుడు త‌న‌కు తానే బెస్ట్ అనిపించుకుంటూ ఈ సంస్థ ప్రేక్షకుల మ‌న‌సుల్లో ప్రత్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకుంది. గ‌డిచిన రెండేళ్లలో తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్నడ భాష‌ల్లో నివృతి సంస్థ 50కి పైగా మ్యూజిక్ వీడియో సాంగ్స్‌ను అందించింది. వీటిలో జ‌రీ జ‌రీ పంచెక‌ట్టి, గుంగులు, సిల‌క ముక్కుదానా, జంజీరే, వ‌ద్ద‌న్నా గుండెల్లో సేరి వంటి పాట‌లు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. ఇప్పుడు ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..’ అనే పాటను వర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.

పాట విడుదల చేసిన అనంతరం జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. ‘నివృతి అంటే సంతోషం అని అర్థం. జయతి గ్యాప్ తీసుకోవడం వల్లే ఈ పాట చేయగలిగింది. పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని కాకుండా.. డ్యాన్స్‌ చేస్తున్న జయతిని చూడటమే విశేషం. భీమ్స్, కాసర్ల శ్యాంలకు పెళ్లి అయింది కాబట్టి అంత కసిగా కొట్టారు. ఈ పాట పెద్ద హిట్ అయి.. పెళ్లి జరిగితే అయ్యే లొల్లి ఏంటో పార్ట్ 2గా తీయాలని కోరుకుంటున్నాను. ఒక్క పాట కోసం ఇంతగా ఖర్చు పెడతారా? అని అనుకున్నాను. ఖర్చు పెడితే కూడా డబ్బులు వెనక్కి వస్తాయని వారి లాజిక్. ఇక్కడకు నన్ను పిలిచినందుకు నివృతి వైబ్స్‌కు థాంక్స్’ అని అన్నారు.



ఇవి కూడా చదవండి

Advertisement



ఇక ఈ పాటను యూట్యూబ్‌లో ఇలా పోస్ట్‌ చేశారో లేదో వ్యూస్‌తో దూసుకుపోతోంది. కేవలం 24 గంటల్లోనే ఈ పాట 2 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకోవడం విశేషం. నివృతి వైబ్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌కు ప్రస్తుతం సుమారు రెండున్నర లక్షలకుపైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. నివృతి వైబ్స్‌ నుంచి వస్తోన్న పాటలు సెన్సేషన్‌గా మారుతోన్న తరుణంలో ఈ కొత్త పాట ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button