Raj-Koti: మా పాటల రూపంలో రాజ్ ఎప్పటికీ బతికే ఉంటారు.. స్నేహితుడి మరణంపై కోటి ఎమోషనల్
ఆదివారం రాజ్ గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన స్నేహితుడు కోటి ఎమోషనల్ అయ్యారు. మా పాటల రూపంలో రాజ్ ఎప్పటికీ జీవించి ఉంటారని భావోద్వేగానికి గురయ్యారు. ‘నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నా. ఈ దుర్వార్తను జీర్ణించుకోలేకపోతోన్నా..
రాజ్- కోటి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ దిగ్గజ ద్వయానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. 180కు పైగా సినిమాలకు కలిసే స్వరాలు సమకూర్చారీ సంగీత దర్శకులు. ప్రళయ గర్జన(1983)తె మొదలైన వీరి ప్రస్థానం ఉదయం, లేడీ జేమ్స్‌బాండ్, పున్నమిరాత్రి, మదన గోపాలుడు, యముడికి మొగుడు, ఖైదీ నెం.786, రౌడీ నెం. 1, త్రినేత్రుడు, విక్కీ దాదా, కొదమ సింహం, కొండవీటి రౌడీ, ముఠామేస్త్రి, హలో బ్రదర్స్ వంటి హిట్ సినిమాలకు బాణీలు అందించారు. అయితే ఎందుకోగానీ రాజ్- కోటిల మధ్య విభేదాలు తలెత్తాయి. విడిపోయి ఎవరికి వారు సినిమాలు చేశారు. అయితే ఆదివారం రాజ్ గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన స్నేహితుడు కోటి ఎమోషనల్ అయ్యారు. మా పాటల రూపంలో రాజ్ ఎప్పటికీ జీవించి ఉంటారని భావోద్వేగానికి గురయ్యారు. ‘నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నా. ఈ దుర్వార్తను జీర్ణించుకోలేకపోతోన్నా. మొన్న ఈ మధ్యే ఓ సినిమా ఈవెంట్‌లో కలుసుకున్నాం. ఆరోగ్య సమస్యలున్నట్టు రాజ్ నాకు చెప్పలేదు. అలాంటిది హార్ట్ ఎటాక్‌తో ఆయన మరణించారని తెలిసి ఎంతో బాధపడ్డాను. రాజ్- కోటిగా మేం ఇద్దరం ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాం. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. విడిపోయిన తరువాత కోటిగా నేను ఎన్ని సినిమాలు చేసినా.. వాటిని కూడా రాజ్ కోటి పాటలు అనేవారు. రాజ్‌కి నేను ఒక తమ్ముడిలాంటి వాడిని’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు కోటి.
చిరంజీవి, పవన్ సంతాపం..
ఇక రాజ్ మృతిపై మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ‘ రాజ్ ఇక లేరనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో ప్రతిభ ఉన్న రాజ్, నా చిత్రాల కందించిన బాణీలు, నా సినిమా విజయాల్లో ముఖ్య పాత్ర పోషించాయి. నన్ను ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. రాజ్ అకాల ప్రస్థానం సంగీత ప్రపంచానికి తీరని లోటు. రాజ్ కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి’ అని ట్వీట్ చేశారు చిరంజీవి. ఇక రాజ్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు జనసేన పార్టీ తరఫున ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రముఖ సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి లలో ‘రాజ్’ ఇక లేరు అని తెలవటం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో ప్రతిభ వున్న రాజ్ , నా కెరీర్ తొలి దశలలో నా చిత్రాలకందించిన ఎన్నో అద్భుత ప్రజాదరణ పొందిన బాణీలు, నా చిత్రాల విజయాలలో ముఖ్య పాత్ర వహించాయి. నన్ను ప్రేక్షకులకు మరింత చేరువ… pic.twitter.com/uPifYfmtFE
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 21, 2023
సంగీత దర్శకులు శ్రీ రాజ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/vTLo3SAzdf
Advertisement— JanaSena Party (@JanaSenaParty) May 21, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి