News

Munugodu Politics: కోమటెడ్డి బ్రదర్స్ ఫ్యూచర్ డిసైడ్ చేయనున్న మునుగోడు ఎన్నికలు.. ఇంట్రస్టింగ్ వివరాలు మీకోసం.. | MP Komatireddy Venkat Reddy Struggle Over Munugodu Bypoll Telangana Politics


Munugodu Politics: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో అందరి దృష్టి..

Munugodu Politics: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో అందరి దృష్టి.. ఆయన సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పడింది. ఎంపీ కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్. రానున్న మునుగోడులో ఉప ఎన్నికలో సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓ వైపు రాజకీయం.. మరోవైపు రక్త సంబంధం. ఈ రెండింటి నడుమ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంకట స్థితిలో పడ్డారు. ఈ తాజా రాజకీయ పరిణామాలు ఆయనకు ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా మారాయి.

ఎందుకంటే.. భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా కంటే, కాంగ్రేస్ పార్టీ స్టార్ క్యా౦పెయినర్ గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అదనపు బాధ్యతలు భుజాన వేసింది హై కమాండ్. అంతేకాదు తన పదవికి న్యాయం చేస్తాననీ, తెలంగాణ అంతటా పర్యటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని తీరును ఎండగడతానని వెంకట్ రెడ్డి ఎన్నో సార్లు చెప్పుకుంటూ వస్తున్నారు. స్టార్ క్యా౦పెయినర్ అనేది పదవి కాదు.. ఇదో భాద్యత అని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే, మారిన రాజకీయ పరిణామాలు వెంకట్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా పరిణమించాయి. అదేంటంటే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్. మునుగోడు ఎమ్మెల్యేగా తన తమ్ముడు రాజ్ గోపాల్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈయన తాజాగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు కాషాయ దళంలో చేరి, బీజేపీ నుంచి పోటీకి దిగాలనే భావనలో ఉన్నారు. అంతేకాదు.. తాను రాజీనామా చేస్తేనే మునుగోడు అభివృద్ధి చెందుతుందని ఓ ప్రకటన వదిలారు.

ఇక ఉప ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి, ఎవరెవరు అభ్యర్థులు ఉంటారనేది పక్కన పెడితే, రాజ్ గోపాల్ రెడ్డి టార్గెట్.. అధికార టీఆర్ఎస్ పార్టీనే. అయినా.. అదే సందర్భంలో మునుగోడు నియోజకవర్గంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో కూడా తలపడాల్సి ఉంటుంది. వాస్తవానికి మునుగోడులో రాజ్ గోపాల్ రెడ్డి వ్యక్తి గత చరిష్మా అటుంచితే, బీజేపీకి పెద్దగా స్కోప్ లేదు. కాంగ్రెస్ పార్టీకి సరైన లీడర్ లేకున్నా.. గ్రామ గ్రామాన కేడర్ బలంగా ఉంది. అయితే, రాజగోపాల్ రెడ్డి నిర్ణయంతో ఇప్పుడు పరువు కోసం కాంగ్రెస్ పోరాడాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఉపఎన్నికల్లో ఘోర పరాభవం..
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన అనంతరం జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. రేవంత్ పీసీసీ పీఠం ఎక్కిన తర్వాత కూడా హుజురాబాద్‌లో కనీసం డిపాజిట్ రాలేదు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక బాధ్యత స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చావో రేవో అన్నట్టుగా మారింది. ఫలితాలు ఏమాత్రం తల కిందులైనా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

తమ్ముడికి వ్యతిరేకంగా తప్పదు మరి..
ఇక ఇప్పటికే తమ్ముడిని కట్టడి చేయడంలో, బుజ్జగించడంలో విఫలమైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తమ్ముడిని ఓడించాలనే పట్టుదలతో, సీరియస్ గా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఎప్పటి నుంచైతే బీజేపీ పాట పాడుతున్నారు. సోదరుడు రాజగోపాల్ రెడ్డికి నచ్చ చెప్పడంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విఫలమయ్యారని విమర్శలు ఉన్నాయి. పాలిటిక్స్‌లో ఎత్తులు, వ్యూహాలు ఎలా ఉన్నా .. ఎంతైనా రక్త సంబంధం, అందులోనూ తమ్ముడికి రాజకీయ ఓనమాలు దిద్దించిన గురువు కూడా. ఈ పరిస్థితుల్లో తమ్ముడి తో ఢీ కొట్టేందుకు వెంకట్ రెడ్డి ఎలా వ్యవహరిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికల్లో సోదరులు ఇద్దరూ ఫెయిల్ అయితే బ్రదర్స్ పొలిటికల్ కెరీర్ కే మాయని మచ్చ అవుతుంది. ఇప్పుడు ఈ అంశాలన్నీ బేరీజు వేసుకుంటున్న కోమటిరెడ్డి బ్రదర్స్ పరిస్థితి కరువమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button