News

Munugode Bypoll: రేపటితో మునుగోడులో ప్రచారం బంద్.. బయటి నుంచి వచ్చిన వారు మునుగోడులో ఉండొద్దు.. సీఈఓ వికాస్‌రాజ్‌


మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. మునుగోడు బైపోల్‌ ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు.

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. మునుగోడు బైపోల్‌ ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. 199 మంది మైక్రో అబ్జర్వర్లు, రెండు జీఎస్టీ టీమ్‌లు నియమించినట్లు వెల్లడించారు. ఇక ఇప్పటివరూ 6.8 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నామ సీఈసీ వికాస్‌రాజ్‌ వెల్లడించారు. 185 కేసులు నమోదు చేశామని వివరించారు. ఈ మేరకు వికాస్ రాజ్ సోమవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలో 2.41లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వారిలో 50 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. నవంబరు 3న జరగనున్న పోలింగ్‌కు సంబంధించి రేపటితో ఎన్నికల ప్రచారం ముగుస్తుందని.. అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. నియోజకవర్గ వ్యాప్తంగా 80 ఏళ్లు దాటిన ఓటర్లు 2,576 మంది ఉన్నారని.. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లు 5,686 మంది ఉన్నారని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం 739 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. వృద్ధులకు ఇంటి దగ్గరే ఓటు వేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు.

మునుగోడు ఉపఎన్నికకు మొత్తం 298 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వికాస్‌రాజ్‌ తెలిపారు. అర్బన్‌ పరిధిలో 35, రూరల్‌ పరిధిలో 263 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసిట్లు తెలిపారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారికి తొలిసారిగా డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డులను మంజూరు చేశామన్నారు. ఇప్పటికే ఓటరు స్లిప్పులను పంపిణీ చేశామని, ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్నాయని వివరించారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. మాక్‌పోలింగ్ దృష్ట్యా గంట ముందుగా ఏజెంట్లు రావాలని సూచించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, ముగ్గురు ఆఫీసర్లు ఉంటారని తెలిపారు.

నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 1,192 మంది సిబ్బంది అవసరం కాగా.. 300 మందిని అదనంగా ఉంచామని తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో బూత్‌లెవెల్‌ ఆఫీసర్లు ఉంటారని, అన్ని చోట్లా మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. మునుగోడు పరిధిలో 105 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామన్నారు. నియోజకవర్గ సరిహద్దుల్లో 100 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ.6.80 కోట్ల నగదు, 4,560 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని, 185 కేసులు నమోదు చేశామని చెప్పారు. ఫిర్యాదుల కోసం సీవిజల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు.

నేరుగా పోలింగ్‌ కేంద్రం నుంచే ప్రతిగంటకు ఓటింగ్‌ శాతం నమోదు చేస్తామని తెలిపారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా రేపు సాయంత్రం 6 గంటల తర్వాత విస్తృత తనిఖీలు చేపడతామని, బయటి నుంచి వచ్చిన వారు నియోజవర్గంలో ఉండకూడదని సూచించారు. ఎస్‌ఎంఎస్‌లపైనా నిషేధం ఉందని.. దీనికి అనుగుణంగా నెట్‌వర్క్‌ ప్రొవైడర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం నియమ నింబంధనలను కచ్చితంగా పాటించి పోలింగ్‌ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Advertisement

ఇవి కూడా చదవండి



లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button