News

Munugode By Poll 2022 Live: మరికాసేపట్లో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభం.. దేశంలోనే తొలిసారిగా న్యూ డిజిటల్‌ ఓటర్‌ ఐడీ కార్డులు..


Munugode By Election Live voting: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరగనున్న పోలింగ్ కోసం అధికారులు సిద్దమయ్యారు..

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరగనున్న పోలింగ్ కోసం అధికారులు సిద్దమయ్యారు. ఈ మేరకు చండూరులోని డాన్ బాస్కో స్కూల్ లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రంలో పోలింగ్ సిబ్బందికి సామగ్రి అందించారు. పోలింగ్ తీరుపై మార్గదర్శకాలు, సూచనలు చెప్పారు. అనంతరం వారికి కేటాయించిన ప్రాంతాలకు సిబ్బంది పయనమయ్యారు. కాగా ఈ ఉపఎన్నికలో ఏ పార్టీ గెలుపు సాధిస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఇవాళ( బుధవారం) ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల సిబ్బందికి పోలింగ్‌ మెటీరియల్‌ పంపిణీ చేశారు. నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 1,21,720 మంది పురుషులు, 1,20,128 మంది స్త్రీలు ఉన్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నిక తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అన్ని పోలింగ్‌ కేంద్రాలకు మొత్తంగా 2,500 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటుండగా, అందులో 1,000మంది పోలీసులు ఉన్నారు. అదర్‌ పోలింగ్‌ ఆఫీసర్స్‌తో పాటు నియోజకవర్గంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్‌ సిబ్బందికి తోడుగా 199 మంది మైక్రో అబ్జర్వర్లు అందుబాటులో ఉంటారు… ఇవి హై ప్రొఫైల్ ఎలక్షన్ కావడంతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను పెట్టామని తెలిపారు ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌.. ఇక ప్రతి పోలింగ్‌ కేంద్రంలో బూత్‌లెవల్‌ ఆఫీసర్లు ఉంటారు.

మునుగోడులోని మొత్తం 298 కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్‭ను కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తోంది ఎన్నికల కమిషన్‌.. ఇందు కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఓటర్ల నుంచి ఫిర్యాదుల కోసం సి-విజిల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారుయ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌. నేరుగా పోలింగ్‌ కేంద్రం నుంచే గంటకోసారి ఓటింగ్‌ శాతం నమోదు చేస్తామన్నారు. ఎన్నికల ఏర్పాట్లను సీఈవో వికాస్‌ రాజ్‌ దగ్గరుంచి పరిశీలిస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతున్న తీరును ఈ లైవ్ వీడియోలో చూడండి..



Related Articles

Back to top button