News

multibagger stocks, Multibagger Stocks: ఇదీ అసలైన మల్టీబ్యాగర్.. లక్షతో రూ.5 లక్షల లాభం.. ఇప్పుడే కొనేయండి! – multibagger stocks this small cap battery manufacturing company turned rs 1 lakh to rs 5.65 lakh in just two years


HBL Power Systems Limited: యూఎస్ ఫెడ్ ఊహించినట్లే వడ్డీ రేట్లను (US Fed Rates Hike) పెంచింది. ఏకంగా 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును పెంచగా.. ఈ వడ్డీ రేట్ల శ్రేణి 3-3.25 శాతం నుంచి 3.75-4 శాతం వరకు పెరిగింది. అయితే రానున్న కాలంలో కాస్త రేట్లు తగ్గుతాయని చెప్పింది. దీంతో అమెరికా మార్కెట్లు బుధవారం సెషన్‌లో నష్టపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో వడ్డీ రేట్ల పెంపుపై ఏమన్నా నిర్ణయం ఉంటుందో చూడాలి. ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock Market Updates) ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి.

ఎస్ అండ్ పీ బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ కంపెనీ హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ (HBL Power Systems Limited) ఇన్వెస్టర్లకు అద్భుతమైన రిటర్న్స్ అందించింది. అదీ రెండేళ్లలోనే. ఇది మీ దగ్గరుంటే కచ్చితంగా పండగ చేసుకుంటారు. అంతలా లాభాలు ఇచ్చింది మరి. ఈ సమయంలో కంపెనీ షేరు ధర భారీగా పెరిగింది. 2020 నవంబర్ 3న రూ.18.60 నుంచి 2022 నవంబర్ 1 వరకు రూ.105.25కు పెరిగింది. ఈ రెండేళ్ల హోల్డింగ్ పీరియడ్‌లో ఏకంగా 465 శాతం పెరగడం విశేషం.

ALSO READ: ట్విటర్ బ్లూటిక్ కోసం 8 డాలర్లు ఛార్జీ.. ఆసక్తికరమైన ట్వీట్ చేసిన సీఈవో, పేమెంట్లు ఇలా

హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ విభిన్న రకాల బ్యాటరీల తయారీలో నిమగ్నమై ఉంది. వీటిల్లో లెడ్ యాసిడ్, నికెల్ కాడ్మియం (NiCad), సిల్వర్ జింక్, లిథియం, రైల్వే, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, సోలార్ ఫొటోవోల్టాయిక్ మాడ్యూల్స్, ఇతర ప్రొడక్ట్స్‌ను ఉత్పత్తి చేస్తుంటుంది. వీటి సర్వీస్ యాక్టివిటీస్‌లో కూడా ఈ కంపెనీ పాలుపంచుకుంటుంది. అయితే ఈ కంపెనీలో రెండేళ్ల క్రితం సరిగ్గా రూ. లక్ష ఇన్వెస్ట్‌మెంట్ పెడితే వారి సంపద నేడు రూ.5.65 లక్షలకు పెరిగేది. అంటే ఏకంగా దాదాపు 5 లక్షల వరకు లాభం వచ్చేది. పండగ చేసుకునేవారు.

కంపెనీ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో రెవెన్యూ ఏకంగా 38 శాతానికిపైగా పెరిగి రూ.319 కోట్లుగా నమోదైంది. అయితే బాటమ్ లైన్ 3 శాతానికిపైగా తగ్గి రూ19.98 కోట్లుగా ఉంది. దీని మార్కెట్ విలువ రూ.2917.48 కోట్లుగా ఉంది. బీఎస్‌ఈలో ఈ స్టాక్ 52 వారాల గరిష్ట విలువ రూ.121.80, కనిష్టం రూ.48.05గా ఉంది.

ఇక దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం తీవ్ర ఒడుదొడుకుల మధ్య ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఈ వార్త రాసే సమయానికి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 40 పాయింట్లు, నిఫ్టీ 10 పాయింట్ల లాభంలో ఉన్నాయి.

భారతదేశపు నంబర్ 1 ఇన్వెస్ట్‌మెంట్ మ్యాగజైన్ దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నల్ ఈ ఆర్టికల్‌ను అందించింది. విన్నింగ్ స్టాక్స్, సిఫార్సులకు సంబంధించిన అప్‌డేట్స్ క్రమం తప్పకుండా పొందడం కోసం ఈ దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.

Disclaimer: This above is third party content and TIL hereby disclaims any and all warranties, express or implied, relating to the same. TIL does not guarantee, vouch for or endorse any of the above content or its accuracy nor is responsible for it in any manner whatsoever. The content does not constitute any investment advice or solicitation of any kind. Users are advised to check with certified experts before taking any investment decision and take all steps necessary to ascertain that any information and content provided is correct, updated verified.

  • READ LATEST Business News and Telugu News

ALSO READ: 4 లక్షల కిలోల బంగారం కొన్న మిస్టరీ బయ్యర్స్.. గోల్డ్ కోసంఎగబడుతున్న వీళ్లంతా ఎవరు?

Advertisement

Related Articles

Back to top button