Multibagger Stock,Bonus Shares: ఒక్క షేరు కొంటే 15 షేర్లు ఫ్రీ.. దెబ్బకు దశ తిరిగింది.. లక్షకు రూ.10 లక్షల లాభం! – multibagger shreeji translogistics stock turns rs 1 lakh to rs 10 lakh in 6 years
శ్రీజి ట్రాన్స్‌లాజిస్ట్ కంపెనీ ఐపీఓ సమయంలో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు మల్టీబ్యాగర్ రిటర్న్స్ వచ్చాయి. గడిచిన ఆరేళ్లలో ఓసారి ఈ కంపెనీ 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ఇచ్చింది. అంటే ఒక షేరు ఉంటే 2 షేర్లు ఫ్రీగా వస్తాయి. అలాగే వాటిని ఓసారి 1:5 నిష్పత్తిలో విభజించింది. అంటే ఒక షేరు 5 షేర్లుగా మారుతుంది. ఈ లెక్కన చూస్తే ఐపీఓ సమయంలో 1 షేరు ఉన్నట్లయితే అది ఇప్పుడు 15 షేర్లుగా మారుతుంది. అప్పుడు రూ. 1000 పెట్టుబడి పెడితే అది ఇప్పుడు రూ. 15000 అవుతుంది.
శ్రీజి ట్రాన్స్‌లాజిస్టిక్స్ ఐపీఓ వివరాలు..
శ్రీజి ట్రాన్స్‌లాజిస్టిక్స్ లిమిటెడ్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఐపీఓ అక్టోబర్, 2017లో ప్రారంభమైంది. బీఎస్ఈ ఎస్ఎంఈలో అక్టోబర్ 13, 2017న లిస్ట్ అయింది. ఒక షేరు ధర రూ. 130గా నిర్ణయించగా.. ఒక లాట్‌కు 1000 షేర్లు కేటాయించారు. అంటే ఒక లాట్ కొనుగోలు చేయాలంటే రూ.1.30 లక్షలు అవసరం అవుతాయి. ఆ తర్వాత అక్టౌబర్ 14, 2019న ఈ కంపెనీ బోనస్ షేర్లు ప్రకటించింది. ఒక షేరు ఉన్న వారికి 2 షేర్లు ఫ్రీగా అందించింది. ఐపీఓ నుంచి తన పెట్టుబడిని ఒకనసాగించిన వారికి ఒక లాట్ వచ్చినట్లు అనుకుంటే వారి షేర్లు 3000 పెరుగుతాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 15, 2023న స్టాక్ స్ప్లిట్ చేపట్టింది కంపెనీ ఒక షేరును 5 షేర్లుగా విభజించింది. రూ. 10 ముఖ విలువ ఉన్న షేర్లను రూ. 2 ముఖ విలువ గల షేర్లుగా మార్చింది. దీంతో 3000 షేర్లు కలిగి ఉన్న ఒక వ్యక్తికి మొత్తం షేర్ల సంఖ్య 15 వేలకు చేరుతుంది.
ప్రస్తుతం బీఎస్ఈ సెన్సెక్స్‌లో శ్రీజి ట్రాన్స్‌లాజిస్టిక్స్ కంపెనీ షేరు గురువారం ట్రేడింగ్‌లో రూ.68.70 వద్ద ఉంది. దీని ప్రకారం చూస్తే ఐపీఓ టైంలో ఒక లాట్ తీసుకుని రూ. 1.30 లక్షలు పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు ఆ షేర్ల విలువ రూ. 10.30 లక్షలకుగా ఉంటుంది.
- Read Latest Business News and Telugu News