Mukesh Ambani,Reliance: రిలయన్స్‌ను వీడుతున్న ఉద్యోగులు.. ఏడాదిలో 1.67 లక్షల మంది ఔట్.. ఏం జరుగుతోంది? – reliance industries sees uptick in employee attrition shows ril annual report
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవలి కాలంలో పలు స్టార్టప్ కంపెనీలను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కంపెనీ కార్యకలాపాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి రోల్స్ ఒకే విధంగా ఉన్నాయి. దీంతో కొందరు ఉద్యోగులు కంపెనీ వీడి వేరే జాబ్ వెతుక్కున్నారు. మరికొందరు ఇదే కంపెనీలోని వేరే విభాగంలో కొత్త రోల్స్‌లోకి మారారు. ఉద్యోగ నియమాకాలు ఎక్కువగా జరిగినప్పుడు చాలా మంది వేరే కంపెనీలో మంచి జాబ్ చూసుకుని రాజీనామా చేశారు. దీంతో రిలయన్స్ అట్రిషన్ రేటు అంతకు ముందు ఏడాదితో పోల్చితే 64.8 శాతం పెరిగింది.
జియోలో 41 వేల మంది ఔట్..
రిలయన్స్ జియోలో ఏడాదిలో మొత్తం 41,818 మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. రిలయన్స్ రిటైల్‌లో చూస్తే ఆ సంఖ్య మూడింతలు ఉంది. మొత్తంగా 1,19,229 మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. దీంతో మొత్తంగా కంపెనీని వీడిన వారి సంఖ్య 1.67 లక్షలుగా ఉంది. రాజీనామా చేసిన వారిలో ఎక్కువ మంది జూనియర్ స్థాయి నుంచి మిడ్ మేనేజ్‌మెంట్ స్థాయి సిబ్బందే ఉన్నారు. మరోవైపు.. ఖర్చులు తగ్గించే ప్రక్రియలో రిలయన్స్ కొంత మంది ఉద్యోగులను స్వచ్ఛందంగా తప్పుకోమని చెప్పినట్లు సమాచారం.
పెరిగిన నియామకాలు..
కంపెనీలో ఉద్యోగుల రాజీనామాలు పెరిగినా మరోవైపు కొత్త నియమాకాలు కూడా భారీగా చేపట్టింది రిలయన్స్. 2023 ఆర్థిక సంవత్సరంలో 2,62,558 మంది ఫ్రెషర్స్ ను వివిధ విభాగాల్లో నియమించుకుంది. ఈ ఏడాది మే నెలలో కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఈ-కామర్స్ విభాగం జియో మార్ట్ 1,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. మరోవైపు రిలయన్స్ 46 వ వార్షిక సదస్సు ఆగస్టు 28 న మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. కంపెనీ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడతారు.
- Read Latest Business News and Telugu News